ముడి ఇనుము ధరలను 100% పెంచిన ఎన్.ఎమ్.డి.సీ

సొంత గనులలేమితో సతమతమవుతున్న విశాఖ ఉక్కు

విశాఖ ఉక్కు నష్టాలకు కారణం సొంతగనులు లేకపోవడమేనా?

ఉక్కునగరం (విశాఖ‌ప‌ట్నం):అంతర్జాతీయంగా ఉక్కు దరలు పెరిగినా , మార్కెట్ బాగున్నా సరే విశాఖ ఉక్కు కర్మాగారం ఎందుకు లాభాలను ఆర్జించలేకపోతుంది అన్నది కార్మికులలో ఆందోళన మొదలయ్యింది. బహిరంగ మార్కెట్ లో టన్ను కి 5వేలనుండి 8వేల వరకూ పెరిగినా, కార్మికులు రికార్డు స్ధాయిలో ఉత్పత్తి తీస్తున్నా కేవలం 170కోట్ల నెట్ ప్రాపిట్స్ మాత్రమే అందుకుంది.విశాఖ ఉక్కు కర్మాగారం కు ముడి ఇనుమును ప్రధానంగా ఎన్ ఎమ్ డి సి నుండి కొనుగోలు చేస్తున్నారు. అయితే ముడి ఇనుము ధరలను ఎన్ ఎమ్ డి సి అమాంతం 100% పెంచింది. దీని వలన ప్రధాన ఉక్కు ఉత్పత్తి దారుడైన విశాఖ ఉక్కు కర్మాగారంపై భారీ బారం పడుతుంది.
విశాఖ ఉక్కు తీర ఆధారిత ఇంటిగ్రేటెడ్ కర్మాగారం
ప్రస్తుతం సంవత్సరానికి 7.3మిలియన్ టన్నుల సామర్ధ్యం కలిగి 2030సంవత్సరానికి 20మిలియన్ టన్నుల సామర్ధ్యంకు విస్తరణకు ప్రణాళికలు కలిగి ,సొంత గనులు లేని ఏకైక ఉక్కు కర్మాగారం విశాఖ ఉక్కు కర్మాగారం(ఆర్.ఐ.ఎన్.ఎల్).కర్మాగారం స్ధాపన నుండి సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కారణాల వల్ల పట్టించుకోలేదు. ఒకటన్ను ఉక్కు ఉత్పత్తికి విశాఖ ఉక్కు కర్మాగారానికి 63% వ్యయం అవుతుంటే, సెయిల్ స్టీల్ కంపెనీలకు మరియు టాటా స్టీల్ కు 48% మరిసు 35% వ్యయం మాత్రమే అవుతుంది.
అటు సెయిల్ లాంటి పబ్లిక్ సెక్టార్ కంపెనీలకు, టాటా మరియు ఇతర ప్రైవేట్ కంపెనీలకు, కంపెనీలే స్ధాపించని ప్రైవేట్ కంపెనీలకు సొంతగనులు వున్నాయి .వీటన్నింటితో సరిపోల్చితే విశాఖ ఉక్కుకు ముడి సరుకుకే అధిక మొత్తాన్ని ఖర్చు చేస్తుండడెతో అనుకున్నంత లాభాలను ఆర్జించలేక సతమతమవుతుంది.
ప్రపంచంలో క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీలేకుండా అత్యుత్తమ ఉక్కును ఉత్పత్తి చేస్తున్న విశాఖ ఉక్కును సొంత గనులు కేటాయించి ఆదుకుంటేనే మంచి లాభాలతో ముందుకు సాగుతుంది. అయితే విశాఖ ఉక్కు కర్మాగారం సంవత్సరానికి 10మిలియని టన్నుల ముడి ఇరన్ ను ఎన్ ఎమ్ డి సి నుండి కొనుగోలు చేస్తుంది.దీనికి సుమారు దీనికి 3500కోట్లకు పైగానే ఖర్చు చేస్తుంది.
ఇందులో సెయిల్ కంటే అధనంగా 1600కోట్ల రూపాయలు వరకూ అదనంగా చెల్లించవలసి వస్తుంది. ఇప్పుడు అమాంతం 100% ధరలను పెంచడం తో బారం రెట్టింపు అయ్యింది. ఎన్ ఎమ్ డి సి ఒక టన్ను ఐరన్ తవ్వకానికి సుమారు 500రూ వరకూ ఖర్చు అవుతుంటే దీనిని విశాఖ ఉక్కుకు ఇప్పటివరకూ టన్ను 3000రూ వరకూ అమ్ముతూవచ్చింది.ఇప్పుడు టన్నును 7000రూ వరకూ పెంచింది. ఎన్ ఎమ్ డి సీ తో లాంగ్ టర్మ్ కాంట్రాక్స్ వున్నా ఓపెన్ మార్కెట్ లో ఈ టెండరింగ్ ద్వారా ముడి సరుకును కొనుగోలు చేసే పరిస్ధితి .
సెయిల్ ఉక్కు కర్మాగారం కంటేవిశాఖ ఉక్కు కర్మాగారం కేవలం ముడి సరుకుకే అధనంగా సంవత్సరానికి 4000వేల కోట్ల రూపాయలు చెల్లిస్తుంది.ఈ వ్యత్యాసం టాటా, జిందాల్ స్టీల్ కర్మాగారాలతో పేల్చితే ఇంకా అధనం.
ఇప్పటికైనా విశాఖ ఉక్కు కర్మాగారంకు సొంత ఇనుపగనులు కేటాయించగలిగితే మరింత లాభాలను ఆర్జించి ముందుకు సాగుతుంది.

అయితే మరోపక్క విశాఖ ఉక్కు ధరలు పెంచారని అటు కొందరు కేంద్ర మంత్రులు చెబుతున్న వాదనలో న్యాయం లేదని ఉక్కు అధికారులు తెలియజేస్తున్నారు.మాకు ముడి సరుకుకే మిగతా కర్మాగారాలకంటే 63% అధికంగా ఖర్చుచేస్తున్నాం కాబట్టి ఉక్కు ధరను పెంచాల్సి వచ్చిందని తెలియజేస్తున్నారు.మాకు ఎన్ ఎమ్ డి సీ నుండి ముడి ఐరన్ ను స్వల్ప లాభంతో సరఫరా చేసినట్లైతే విశాఖ ఉక్కును బహిరంగ మార్కెట్ లో తక్కువ ధరకు అమ్మగలిగే వాళ్లం అని అధికారులు తెలియజేస్తున్నారు.ఇప్పటి కైనా రాష్ట్ర ఎమ్.పి లు దీనిపై దృష్టి సారించి పార్లమెంట్ లో గలం విప్పి విశాఖ ఉక్కు కు సొంత గనులు సాదించాలి .ఎం పి పదవికి వెన్నె తేవాలని కార్మికులు ఉత్తరాంధ్రా ప్రజలు కోరుకుంటున్నారు.లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కును కాపాడుతారో లేక నిర్వీర్యం చేస్తారన్నది ప్రజా ప్రతినిధులపైనే ఆధారపడి వుంది.

(Visited 29 times, 2 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *