సమాచార హక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్న తహసీల్దార్ కార్యాలయం

అనకాపల్లి :

అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం సమాచార హక్కు చట్టం ద్వారా వస్తున్న దరఖాస్తులకు ఎటువంటి సమాచారం అందించకుండా తూట్లు పొడుస్తుందని మాజీ సర్పంచ్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు పొలమరశెట్టి నాగేశ్వరరావు విమర్శించారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ అనకాపల్లి పట్టణం సౌత్ వన్ ఏరియాకు సంబంధించి ఎస్ ఎఫ్ ఎ వివరాలు అందించాలని ఆర్టిఐ చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నానన్నారు. కార్యాలయంలో పలుమార్లు సంప్రదించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా కావడంతో కలెక్టర్ వంటి ఉన్నతాధికారులు ఉన్నారన్న కనీస బాధ్యత రెవెన్యూ అధికారులకు లేకపోవడం విచారకరమన్నారు. చేసేది లేక ఈ చిన్న పాటి సమాచారానికై ఆర్డిఓ కార్యాలయంలో అపీలుకు వెళ్తున్నట్లు పొలమర శెట్టి నాగేశ్వరరావు తెలియజేశారు.

(Visited 123 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.