కాకినాడ ఆస్పత్రిలో సౌకర్యాల కరువు
కాకినాడ: కాకినాడ జిజిహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక బెడ్ మీద ఇద్దరు రోగులు చొప్పున ఉంచడం తో కరోణ భయంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. అయితే కొందరు తమ ఇళ్ల నుండి చాపలు తెచ్చుకుని నేలమీదే వైద్యం చెయ్యించుకుంటున్నారు. తమ నాయనమ్న అనారోగ్యంతో ఉండటంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకు వచ్చామని అయితే ఇక్కడ రోగులకు బెడ్ లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని పీలా నందు అనే యువకుడు వీ డ్రీమ్స్ కు తెలిపాడు.రోగులు పెరిగితే ఒకే బెడ్ మీద ముగ్గురు చొప్పున ఉంచడం జరుగుతుందని వైద్యడు అనడం విచారకరమని అన్నారు. తక్షణం ఉన్నత అధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ లు ఎర్పాటు చేసి పారిశుధ్యం మెరుగు పరచాలని కోరారు.
(Visited 153 times, 1 visits today)