ఎన్టీఆర్ హాస్పిటల్ లో ఎముకల డాక్టర్నియమించాలి

సిపిఐ డిమాండ్

అనకాపల్లి: స్థానిక ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న ఎముకల డాక్టర్ ను జనరల్ సర్జన్ ను నర్సింగ్ సిబ్బంది ని తక్షణమే నియమించాలని సిపిఐ నాయకులు వై.ఎన్ భద్రం, నాయుడు.మల్లికార్జున రావు,కోన లక్ష్మణ, కొరిబిల్లి శంకర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరులసమావేశంలో వారు మాట్లాడుతూ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఆస్పత్రిలో యాక్సిడెంట్ కేసులు ఎక్కువ వస్తాయని గత కొద్ది నెలలుగా ఆస్పత్రిలో ఎముకల డాక్టర్ లేక క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్ కు తరలించి తున్నారని ఆసమయానికి వైద్యం అందక రోగులు మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే ఆపరేషన్లు చేసే డాక్టర్ గత కొద్ది రోజులుగా లేక రోగులను కూడా విశాఖ తరలిస్తున్నారని కేవలం అనకాపల్లి ప్రభుత్వాసుపత్రి రిఫరల్ ఆసుపత్రి గా ఉండడం దుర్మార్గమన్నారు వంద పడకల ఉన్న ఆస్పత్రిని 200 పడకలకు అప్గ్రేడ్ చేసిన కనీసం వంద పడకల అవసరమయ్యే 40 మంది డాక్టర్లు ,80 మంది నర్సింగ్ స్టాఫ్ ఉండగా కేవలం 10 మంది డాక్టర్లు 20 మంది మాత్రమే ఉన్నారని సిబ్బంది కొరత వల్ల ఆస్పత్రిలో సకాలంలో నాణ్యమైన న్యాయమైన వైద్యసేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు .

అలాగే ఎం ఎన్.ఓ, ఎఫ్ ఎన్ ఓ సిబ్బంది లేక రోగుల బంధువులే రోగులను మోసుకునే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య సిబ్బంది గాని సెక్యూరిటీ గార్డ్స్ జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని వెంటనే స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే వైద్య ఉన్నతాధికారులు కలుగచేసుకుని సమస్య పరిష్కరించకుంటే ప్రజల తరఫున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు

(Visited 9 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *