ప‌ల‌కా య‌శోధ విస్తృత ప్ర‌చారం

అనకాప‌ల్లి : జీవీఎంసీ ఎన్నికలలో భాగంగా 84వ వార్డ్ వైస్సార్సీపీ ప్రచారం జోరుగా సాగింది ముందుగా వైస్సార్సీపీ నాయకులు జరణంసురేష్,చేబ్రోలు సత్య,గొల్లవిల్లి రమణ,అరిగా అప్పారావు,వీరవరపు వరప్రసాద్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేసారు. గ్రామంలో రామాలయంలో యశోద రవి దంపతులు పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. భారీ జనసందోహంతో గడప గడపకు సాగిన ప్రచారంలో జైజగన్, జైఅమర్  అనే నినాదాలతో ప్రాంతమంతా హోరేత్తింది ప్రతిఒక్కరూ ఫ్యాన్ గుర్తుకే మన ఓటు అని స్వచ్ఛందంగా నినదించడం గమనార్హకం. భారీ మెజారిటీతో యశోద రవి ని గెలిపించుకుంటాం ప్రజలు మాటిచ్చారు.ఈ సందర్భంగా గ్రామ వైసిపి నాయకులు కరణం సురేష్ మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చి పేదలకు అండగా ఉందన్నారు. ప్రజలకు జగనన్న ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు గుండెల్లో నిలిచిపోయాయని‌ చేబ్రోలు సత్య అన్నారు. మీ ఇంట పెద్దకొడుకునవుతాను అని జగనన్న పాదయాత్రలో మాటిచ్చిన ప్రకారం పెద్ద కొడుకు స్థానంలో బృహోత్తర పథకాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నాడని అరిగా అప్పారావు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిధులన్నీ గత ప్రభుత్వ పాలకులు నాయకులు దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసారని అయినా కూడా మాటమార్చడం మడమతిప్పడం తెలీని జగనన్న ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారని అందుకే ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారని ఆనందం వెలిబుచ్చారు ఎమ్మెల్యె అమర్ నాద్ హయంలో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి జరిగిందని మరల మన ప్రభుత్వంతో అభివృద్ధి కొనసాగుతుందని అన్నారు. మనందరి ఆడపడుచు యశీద రవి ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అలాగే ప్రజలకు ఏ సమయంలోనైనా తోడుండే మంచి మనిషి మన యశోద రవి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

(Visited 100 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *