డీజిల్, పెట్రోల్ ,వంట గ్యాస్ ధరల పెంపుపై సీపీఐ ధ‌ర్నా

అన‌కాప‌ల్లి : భారీగా పెంచిన డీజిల్, పెట్రోల్ ,వంట గ్యాస్ ధరల ను తగ్గించాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీపీఐ ధర్నా నిర్వహించారు. శుక్రవారం నెహ్రూచౌక్ కూడలిలోజాతీయ పార్టీలు ,కార్మిక,రైతు సంఘాలు పిలుపుమేరకు పార్టీఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు సిపిఐ నాయకులు వై.ఎన్ భద్రం, కోన లక్ష్మణ,తాకాశి వెంకటేశ్వరరావు, కోరుబిల్లి శంకర్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి పేద సామాన్య మధ్యతరగతి ప్రజల పైన పెను భారం మోపిందన్నారు. ప్రభుత్వ రంగా సంస్థలి ప్రైవేటీకరణ చేయడం నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచిన ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. వ్యవసాయాన్ని కూడా ప్రైవేటు చేయడానికి 3 రైతు వ్యతిరేక చట్టాలు తీసుకు వచ్చి ఆదాని, అంబానీలకు కట్ట బెట్టలని చూస్తుందని మండిపడ్డారు పెంచిన ధరలు తగ్గించాలని స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వరంగంలో నడిపించాలని డిమాండ్ చేస్తూ నెహ్రూ చౌక్ లోని బస్సులు అడ్డంగా కూర్చొని ధర్నా నిర్వహించారు పోలీసులు ఎస్ ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో సిపి ఐ నాయకులు భద్రం, లక్ష్మణ, శంకర్రావు లను అరెస్టు చేసి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు మోడీ ప్రభుత్వం గద్దె దిగే వరకు అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు

(Visited 54 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *