స్వరంతో ప్రాచుర్యం పొందిన పిజె శర్మ
( పిజె శర్మ వర్ధంతి సందర్భంగా VDREAMS అందిస్తున్న ప్రత్యేక కథనం)
ప్రముఖ రంగస్థల,సినీ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పూడిపెద్ది జోగేశ్వర శర్మ విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం కళ్లేపల్లి రేగ అనే గ్రామంలో 1933 మే 24న జన్మించారు. తల్లి కమల, తండ్రి నరసింహం.12ఏళ్లకే రంగస్థలంపైకి అడుగుడిన పి.జె.శర్మ విజయనగరంలో నవ్యాంధ్ర నాటక కళాపరిషత్‌ను స్ధాపించి వందలాది కళాకారులను వెలుగులోకి తెచ్చారు. గురజాడ రాసిన కన్యాశుల్కం నాటకంలో లుబ్దావధానులు పాత్రకు ఆయన పెట్టింది పేరు.
1954 డిసెంబర్ 17న అశ్వరాజ్ ఫిలింస్ పతాకంపై కె గోపాలరావు, నాగిశెట్టి ముకుందరావు సంయుక్తంగా నిర్మించగా వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ఆదినారాయణరావు సంగీత దర్శకత్వంలో అక్కినేని, అంజలీదేవి నటించగా అన్నదాత అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమాతోనే వెండితెరకు పిజె శర్మ పరిచయమయ్యారు.1957లో పిజె శర్మ విజయనగరం నుండి మద్రాసుకు పయనమయ్యారు. అదే ఏడాది శ్రీశ్రీ, ఆరుద్రల సహకారంతో సినీరంగంలోకి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పరిచయమయ్యారు.
1957లో ఉత్తమ ఇల్లాలు అనే చిత్రం విడుదల కాగా ఆ సినిమాతోనే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగుతెరకు శర్మ పరిచయం కాబడ్డారు.1959 మే 1న ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎవి సుబ్బారావు నిర్మాతగా తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో ఇల్లరికం అనే చిత్రం విడుదలైంది. అక్కినేని, జమున జంటగా నటించిన ఈ సినిమాలో శర్మ నటించారు.ఇల్లరికం చిత్రంతో నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా రాణించారు. శివాజీ గణేశన్, ఎం.జి.రామచంద్రన్, జెమినీ గణేశన్, నంబియార్, శ్రీరామ్, రాజ్‌కుమార్, ప్రేమ్‌నజీర్ వంటి మహానటులుకు డబ్బింగ్ చెప్పారు.
నటుడిగా 150 సినిమాలకు, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా 500కు పైగా చిత్రాలకు ఆయన పనిచేసారు. 1960లో కృష్ణజ్యోతిని వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు సాయికుమార్, రవిశంకర్, అయ్యప్ప శర్మ అనే ముగ్గురు కుమారులు కమల, ప్రియ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.1967లో వాహినీ పిక్చర్స్ బ్యానర్‌పై బిఎన్ రెడ్డి స్వీయనిర్మాణంలో దర్శకత్వంలో విడుదలైన రంగులరాట్నం చిత్రంలో పిజె శర్మ నటించారు. ఈ సినిమాతోనే చంద్రమోహన్, విజయనిర్మల వెండితెరకు పరిచయం కాబడ్డారు. 1968లో జయంతి పిక్చర్స్ బ్యానర్‌పై కెవి రెడ్డి దర్శకత్వంలో ఎన్‌టి రామారావు, బి.సరోజాదేవి జంటగా నటించగా విడుదలైన భాగ్యచక్రము అనే సినిమాలో పిజె శర్మ నటించారు.1971లో శోభన్‌బాబు, కాంచన జంటగా వి.మధుసూదనరావు దర్శకత్వంలో విడుదలైన కళ్యాణమంటపం అనే చిత్రంలో పిజె శర్మ నటించారు.1972 మార్చి 10న జెమిని ఆర్ట్ ్స ప్రయివేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఎస్ ఎస్ బాలన్ స్వీయనిర్మాణంలో దర్శకత్వం వహించగా జగ్గయ్య, జమున నటించగా విడుదలైన కలెక్టర్ జానకి చిత్రంలో పిజె శర్మ నటించారు.1973 జూలై 5న అంజలీ పిక్చర్స్ బ్యానర్‌పై పి ఆదినారాయణరావు నిర్మాతగా వి.మధుసూదనరావు దర్శకత్వంలో అక్కినేని, అంజలి జంటగా నటించగా విడుదలైన భక్తతుకారం చిత్రంలో మంత్రి పాత్రను పిజె శర్మ పోషించారు.
1975 జనవరి 10న లక్ష్మీనారాయణ పిక్చర్స్ బ్యానర్‌పై పొట్లూరి వెంకట నారాయణరావు, ఎస్ బి కె ఉమామహేశ్వరరావు సంయుక్తంగా నిర్మించగా బాపు దర్శకత్వంలో ఎన్ టి రామారావు, బి సరోజాదేవి నటించగా విడుదలైన శ్రీరామాంజనేయయుద్ధం అనే చిత్రంలో శివుని పాత్రలో పిజె శర్మ నటించారు.అదే ఏడాది ఆగస్టు 14న సమతా ఆర్ట్ ్స బ్యానర్‌పై విఆర్ యాచేంద్ర, కె.ఛటర్జీ సంయుక్తంగా నిర్మించగా వి.మధుసూదనరావు దర్శకత్వంలో శోభన్‌బాబు, మంజుల జంటగా నటించగా విడుదలైన జేబుదొంగ చిత్రంలో పిజె శర్మ నటించారు.1976లో అంజలీ పిక్చర్స్ పతాకంపై ఆదినారాయణరావు నిర్మాతగా సంగీత దర్శకునిగా వ్యవహరించగా అక్కినేని,అంజలీదేవి, మంజుల నటించిన మహాకవి క్షేత్రయ్య సినిమా విడుదలైంది. ఆదుర్తి సుబ్బారావు, సిఎస్ రావులు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సిద్ధేంద్రయోగి పాత్రలో పిజె శర్మ నటించారు.1976 జనవరి 8న రామకృష్ణా సినీస్టూడియోస్ బ్యానర్‌పై ఎన్ టి రామారావు నిర్మాతగా డి.యోగానంద్ దర్శకత్వంలో విడుదలైన వేములవాడ భీమకవి అనే చిత్రంలో పిజె శర్మ నటించారు. 1977 జనవరి 14న మాధవీ పద్మాలయా కంబైన్స్ బ్యానర్‌పై ఎ ఎస్ ఆర్ ఆంజనేయులు నిర్మాతగా కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో కృష్ణ నటించిన కురుక్షేత్రము చిత్రంలో కృపాచార్యుని పాత్రను పిజె శర్మ నటించారు. అదే ఏడాది ఆగస్ట్ 12న మారుతీ కంబైన్స్ పతాకంపై ఎ గోపాలకృష్ణరెడ్డి నిర్మాతగా జిసి శేఖర్ దర్శకత్వంలో శివాజీ గణేశన్, కృష్ణంరాజు నటించగా విడుదలైన జీవనతీరాలు చిత్రంలో పిజె శర్మ నటించారు. అదే రోజున రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌పై ఎన్ టి రామారావు స్వీయనిర్మాణంలో దర్శకత్వం వహించిన దానవీరశూరకర్ణ సినిమాలో విదురుని పాత్రను పిజె శర్మ పోషించారు.
1978 జనవరి 4న లలితా శివజ్యోతి స్టూడియోస్ బ్యానర్‌పై ఎ శంకర్‌రెడ్డి నిర్మాతగా బిఏ సుబ్బారావు దర్శకత్వంలో ఎన్ టి ఆర్, కృష్ణరరాజు, వాణిశ్రీ నటించగా విడుదలైన సతీసావిత్రి చిత్రంలో పరమశివుని పాత్రలో పిజె శర్మ నటించారు.అదే ఏడాది జనవరి 14నఉదయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై కె బాపయ్య దర్శకత్వంలో కృష్ణ, విజయనిర్మల నటించగా విడుదలైన ఇంద్రధనుస్సు చిత్రంలో పిజె శర్మ నటించారు.1980 మే 31న రజనీకాంత్ నిర్మాతగా విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ, రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించగా విడుదలైన రామ్ రాబర్ట్ రహీమ్ చిత్రంలో పిజె శర్మ నటించారు.1981లో జగదీష్ ప్రసాద్ నిర్మాతగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో రాజా, స్వప్న జంటగా నటించగా విడుదలైన స్వప్న అనే చిత్రంలో పిజె శర్మ నటించారు. అదే ఏడాది మే 15న క్రాంతికుమార్ నిర్మాతగా ఎ కోదండరామిరెడ్డి దర్శకత్వంలచిరంజీవి, రాధిక నటించన న్యాయంకావాలి అనే చిత్రంలో జడ్జి పాత్రలో పిజె శర్మ నటించారు.1983 ఏప్రిల్ 14న లక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శోభన్‌బాబు, రాధిక నటించగా విడుదలైన ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో కమీషనర్ పాత్రలో పిజె శర్మ నటించారు.అదే ఏడాది అక్టోబర్ 28న సంయుక్తా మూవీస్ బ్యానర్‌పై ఎం తిరుపతిరెడ్డి సమర్పణలో ధనుంజయ రెడ్డి నిర్మాతగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, మాధవి, సుమలత నటించగా విడుదలైన ఖైదీ అనే చిత్రంలో పిజె శర్మ నటించారు.1985 అక్టోబర్ 23న అల్లు అరవింద్ నిర్మాతగా ఎ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, భానుప్రియ నటించగా విడుదలైన విజేత అనే చిత్రంలో పిజె శర్మ నటించారు.1986 జనవరి 3న శ్రీనివాసా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అట్లూరి రాధాకృష్ణమూర్తి, కొమ్మన నారాయణరావు సంయుక్తంగా నిర్మించగా విజయబాపినీడు దర్శకత్వంలో కృష్ణ, జయప్రద జంటగా నటించగా విడుదలైన కృష్ణగారడి అనే చిత్రంలో పిజె శర్మ నటించారు.
1987లో రాధామాధవి ఫిలింస్ బ్యానర్‌పై మండవ గోపాలకృష్ణ నిర్మాతగా క్రాంతికుమార్ దర్శకత్వంలో సుహాసిని ప్రధాన పాత్రలో విడుదలైన గౌతమి అనే చిత్రంలో పిజె శర్మ నటించారు.1988 జనవరి 15న కృష్ణచిత్రా బ్యానర్‌పై వై అనిల్‌బాబు నిర్మాతగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో బాలకృష్ణ, విజయశాంతి జంటగా నటించగా విడుదలైన ఇనస్పెక్టర్ ప్రతాప్ అనే చిత్రంలో ఇనస్పెక్టర్ జనరల్ పాత్రలో పిజె శర్మ నటించారు.1990 జూన్ 29న సూర్యామూవీస్ బ్యానర్‌పై ఎ ఎం రత్నం నిర్మించగా మోహన్‌గాంధీ దర్శకత్వంలో విజయశాంతి ప్రధానపాత్రలో విడుదలైన కర్తవ్యం అనే చిత్రంలో పిజె శర్మ నటించారు.1998లో జ్యోతి మూవీస్ పతాకంపై అయ్యప్పశర్మ స్వీయనిర్మాణంలో దర్శకత్వం వహించగా సాయికుమార్, సౌందర్య జంటగా నటించగా విడుదలైన ఈశ్వర్ అల్లా అనే చిత్రంలో పిజె శర్మ నటించారు. అదే ఏడాది జూన్ 4న శ్రీనివాసా ఆర్ట్ బ్యానర్‌పై వి.శ్రీనివాసరెడ్డి నిర్మించగా ముత్యాలసుబ్బయ్య దర్శకత్వంలో బాలకృష్ణ, లైలా జంటగా నటించగా విడుదలైన పవిత్ర ప్రేమ అనే చిత్రంలో పోలీస్ కమీషనర్ రజనీకాంతరావు పాత్రలో పిజె శర్మ నటించారు.2005 ఆగస్టు 10న జయభేరి ఆర్ట్స్ బ్యానర్‌పై డి.కిషోర్, ఎం రామమోహన్ సంయుక్తంగా నిర్మించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు, త్రిష నటించగా విడుదలైన అతడు అనే చిత్రంలో పిజె శర్మ నటించారు. 2003 జనవరి 10న సూర్యా మూవీస్ బ్యానర్‌పై ఎ ఎం రత్నం నిర్మించగా డికె సురేష్ దర్శకత్వంలో జూనియన్ ఎన్‌టిఆర్, సదా జంటగా నటించగా విడుదలైన నాగ అనే చిత్రంలో పిజె శర్మ నటించారు. పిజె శర్మ నటించిన చివరి చిత్రం ఇదే. ఆది సినిమాతో హీరోగా వెండితెరపైకి వచ్చిన ఆది ఆయన మనుమడు.2014 డిసెంబర్ 14వ తేదీన ఇష్టదైవ సాన్నిధ్యాన్ని చేరుకున్నారు.