సత్య దేవుని సాక్షిగా ప్లాస్టిక్ వ్యర్దాలే గోమాత ఆహారం. విచ్చలవిడిగా అన్నవరం దేవస్థానం అంతటా ప్లాస్టిక్ వ్యర్దాలతో పేరుకుపోయిన పరిస్థితి
అన్నవరం :
గోవులను ప్రతి ఒక్కరు దైవంతో కొలుస్తారు.అటువంటి గోమాత కు అన్నవరం లో కష్టం వచ్చింది. ప్లాస్టిక్ వ్యర్దాలే గోమాత కు ఆహారం. రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధానికి ప్రభుత్వం నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎక్కడా ప్లాస్టిక్ వాడుక నియంత్రణ జరగటం లేదు. దీంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్దాలతో పేరుకు పోతున్నాయి. కట్టడి చెయ్యవలసి అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారు.మంగళవారం రాత్రి పది గంటల సమయంలో అన్నవరం దేవస్థానం పాదాల వద్ద గోమాత ప్లాస్టిక్ వ్యర్థాలను తింటుండగా ఆ దృశ్యాలు వీ డ్రీమ్స్ కెమెరా కి చిక్కాయ్యి.అన్నవరం దేవస్థానం పాదాల వద్ద రోడ్డు కు ఇరువైపులా ఉన్న వాణిజ్య సముదాయాలలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్లపై పడవెయ్యడంతో ఈ వ్యర్థాలు గోవులకు ఆహారంగా తయారయ్యాయి. గోవులు ప్లాస్టిక్ వ్యర్థాలను తింటున్నా అక్కడ ఏ ఒక్కరు కనీసం వాటిని తొలగించె చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు ప్లాస్టిక్ వినియోగం పై కఠిన చర్యలు తీసుకోవాలని గోమాత సంరక్షకులు డిమాండ్ చేస్తున్నారు.