అభివృద్ధి, సంక్షేమం చూసి ఓటెయ్యండి

వైఎస్సార్‌సీపీ పేద‌ల ప్ర‌భుత్వం
నీలిమా భాస్క‌ర్‌ను గెలిపిద్దాం
వైఎస్సార్‌సీపీ నేత దాడి ర‌త్నాక‌ర్‌


అన‌కాప‌ల్లి :జీవీఎంసీ విలీన గ్రామాలైన రాజుపాలెం, వల్లూరు గ్రామాలలో దాడి రత్నాకర్ పర్యటించారు. రానున్న జీవీఎంసీ ఎన్నికలలో భాగంగా వైస్సార్సీపీ అభ్యర్థిని కొణతాల నీలిమ భాస్కర్ ల విజయాన్ని కాంక్షిస్తూ గడప గడపకు పర్యటించారు. వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు,ప్రజలుయువకులు పెద్ద ఎత్తున హాజరయ్యి పర్యటనను విజయవంతం చేశారు. అడుగడుగునా నీరజనాలు నినాదాలతో రాజుపాలెం, వల్లూరు గ్రామాలు పండగ వాతావరణాన్ని సంతరించుకుంది.ఈ సందర్బంగా రత్నాకర్ మాట్లాడుతూ గత ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన జగనన్న ప్రభుత్వానిదే. రాబోయే జీవీఎంసీ ఎన్నికలలో కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో వైస్సార్సీపీ అభ్యర్థిని నీలిమని గెలిపించి మన ప్రాంత అభివృద్ధికి మనమే పాటుపడాలన్నారు. తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలని అందరు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నీలిమ భాస్కర్ ని గెలిపించాల‌ని కోరారు. ఇప్పటికే ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు గత సంవత్సర కాలంగా ఎన్నో సమాజ సేవాకార్యక్రమాలు మీ గ్రామాలకి చెయ్యటం మీకు తెలుసనీ ఏ పదవి లేకున్నా మీకష్టాలను పంచుకుంటున్న నీలిమ భాస్కర్ రేపు రాబోయే ఎన్నికలలో కార్పొరేటర్ గా గెలిచి మీకెన్నో సహాయ సహకారాలు అందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు కొణతాల శ్రీనివాసరావు, కె.ఎమ్. నాయుడు, కాండ్రేగుల శ్రీరామ్,కర్రి రమేష్, కర్రి మోదినాయుడు,నగిరెడ్డి రాంబాబు,ఎర్ర సింహాద్రి,గుర్రం సత్యారావు, గొల్లవిల్లి వాసు, గొల్లవిల్లి త్రినాధ్, గొల్లవిల్లి రాజు, గొల్లవిల్లి చిరంజీవి,చెల్లుబోయిన అప్పలనాయుడు, శిమ్మ గోపి, శిమ్మ శ్రీను, ఎర్ర నాగరాజు, ఎర్ర అప్పారావు, శిమ్మ మాణిక్యం, బత్తిన గణేష్, సబ్బవరం శంకర్, కోరుబిల్లి ఆరుద్ర,కర్రి అప్పాజీ,విల్లూరి శేఖర్, విల్లూరి సంతోష్, కొణతాల చందు, పెంటకోట సునీల్ మరియు మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

(Visited 222 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *