విజ‌య‌ల‌క్ష్మిని గెలిపించండి

ఎమ్మెల్సీ బుద్ధ నాగ‌జ‌గ‌దీశ్‌

అన‌కాప‌ల్లి :జీవీఎంసీ ఎన్నికల్లో 80 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా  బొడ్డేడ వరలక్ష్మి విజయానికి ఈరోజు ఉదయం 8 గంటల నుండి విజ్ఞాన సమితి నుండి బయలుదేరి ఇంటింటి ప్రచారం చేస్తూ శాంతినగర్ సంత బయల చాకలి పేట నూకాలమ్మ గుడి ఏరియా విల్లూరు వారు దొడ్డి పర్యటిస్తూ శాసనమండలి సభ్యులు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వర్రావు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాలంటే పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు తగ్గాలంటే తెలుగుదేశం అభ్యర్థులను గెలిపిస్తే ధరలను అదుపులోకి తీసుకు వస్తామని నాగ జగదీష్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాయమాటలతో నయవంచన తో ఇంటి పట్టాలు ఇస్తామని చెప్పి సంతకాలు లేని కాగితాలు ఇచ్చారని రెండు వేల ఐదు వందల ఇరవై మందికి ఇచ్చిన టిడొ్ గృహాలను గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇచ్చిన గృహాలను విశాఖపట్నం వాసులకు ఇచ్చి పట్టణ ప్రజలను మోసం చేశారని బడుగు బలహీన హరిజన గిరిజనులను మోసం చేశారని ఈ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులకు ఓట్లు వేసి వైసీపీకి బుద్ధి చెప్పాలని నాగ జగదీష్ ఓటర్లకు తెలిపారు ఈ కార్యక్రమంలో బొడ్డేడ జోగినాయుడు బొడ్డేడ మురళి కర్రీ మల్లేశ్వరరావు దూలం ప్రసాద్ కాండ్రేగుల రాజు బుద్ధ మహాలక్ష్మి నాయుడు బుద్ధ శ్రీను బుద్ధ భువనేశ్వర్ రావు బొడ్డేడ శ్రీను బీవీఎస్ అప్పారావు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు

(Visited 110 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *