ప్రీ వ్యాక్సిన్ ప్రిపరేషన్
ప్రయోగాలన్నీ మానవాళిని శాసిస్తాయి
ప్రయోగ ఫలితాలు అన్నీ సమర్థతకు
ప్రామాణికంగా నిలుస్తాయి
అభివృద్ధి కోరుకున్నంత వరకూ బాగుంటుంది
సైన్సు మాత్రమే అభివృద్ధి చెందాలన్న కోరిక
మానవాళి ఉన్నంత వరకూ బాగుంటుంది
కోరి తెచ్చుకున్న జబ్బులకూ..కోరి అంటించుకున్న జబ్బులకూ
వైద్యమే పరిష్కారం ఇవ్వాలి..ఇస్తుంది
ఈ మనుషులు
ఎవరు ఎటువంటి వారయినా భేదం అయితే పాటించదు
వైరస్సులు ఎలా భేదం పాటించవో వైద్య కూడా అలానే భేదం పాటించదు
ఇవాళ భారతీయుల విజయంలో కొత్త నమోదు
ఆ ఖాతాలో చెప్పుకోదగ్గ మాట..నిందలు కాదు నిరూపణలే
ప్రయోగ విలువలను శ్లాఘిస్తాయి..లేదా ప్రశంసిస్తాయి
మన బల్లపై చేసే చరువు లేదా
వినిపించే శబ్దం మాత్రమే మన గుండె చప్పుళ్లకు ప్రతినిధి
నిశ్చింతలో భారత్ ఉంది..ప్రపంచాన్నీ ఉంచుతుంది
కొత్త వైరస్ రాకలను గుర్తించే పనిలోనూ ఉంది..ఏమయినా మీరు జాగ్రత్త..
110 శాతం ఈ మందు పనిచేస్తుంది
120 కోట్ల మందికీ పనిచేస్తుంది
బయట నుంచి వచ్చే వారు ఎవ్వరయినా
దీనిని తీసుకుని జబ్బు నుంచి బయట పడవచ్చు
రెండు రకాల వైరస్సులకూ ఇదే మందు
భారత్ బయోటెక్ చెబుతున్న మాట
చెప్పాలనుకున్న మాట
కొవ్యాగ్జిన్ రూపకర్త ఈ ప్రాజెక్టు సారథి
భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా
చెబుతున్న మాట..వినండిక
మార్నింగ్ రాగా : ప్రీ వ్యాక్సిన్ ప్రిపరేషన్
ఒక కేంద్ర మంత్రి కొవ్యాగ్జిన్ రాకను విశ్లేషిస్తూ దీన్నొక భగీరథ ప్రయత్నం అంటున్నారు. శాస్త్రవేత్తలంతా ప్రామాణీకరించిన గంగను సీసాలో ఎ క్కించి మన దగ్గరకు తెస్తున్నారు.ఇందులో రసాయనం ప్రయోగ విలువల గొప్పదనాన్ని చాటుతుంది.. సాధారణ ప్ర యత్నాలకు భిన్నంగా ఉంది కనుక దీనిని భగీరథ ప్రయత్నం అన్న మాటతో పోల్చారు..మళ్లీ మరో గంగ చెంతకు చేరుతుంది. భా రతీయులు భారతీయతకు పట్టంకడితే కొన్ని గొప్ప సంస్కరణల కొన్ని గొప్ప ప్రయోగాల విలువలు ఏంటన్నవి తెలిసివస్తాయి. చె ప్పానుగా మ న శాస్త్రజ్ఞులకు మనం ఇచ్చే గౌరవం అభినందన వారి కీర్తిని విశ్వ వ్యాప్తం చేస్తాయి. ఈ క్రమంలో భారతీయులు ప్ర యోగ నడకను తెల్సుకోవాలి..గమానాన్ని గుర్తించి గమ్యం చేరుకున్న వైనం ఎలాంటిదన్నది విశ్లేషించగలగాలి.. ఈ స్థాయిలో ఆ లోచిస్తేనే వైరస్సు ల నియంత్రణ సాధ్యం.. మనలో బాధ్యతా రాహిత్యం అన్నది తొలగిపోవడం సాధ్యం. నిద్రను ఓ చోట వదిలి కేవ లం కలలను మా త్రమే దేహం పై నిలిపి ప్రయాణించిన ఆ తీరు గొప్పదని చదివేను. ప్రయోగ గదుల్లో జ్ఞానం వికసిస్తుంది..లేదా విక సించిన మేధ స్సు మరికొంత వృద్ధికి నోచుకుంటుంది. అలాంటి వేళ మనుషులంతా ఆ వేదికపై సమానులే.
కొత్త వేకువల సృష్టి సాధ్యమే!
ఎండలను నీడలుగా అనువదించిన చెట్టు తల్లికి మోకరిల్లాడు రావూరి భరద్వాజ..మళ్లీ అలాంటి సందర్భమే ఈ కృష్ణ ఎల్లా చెంత కూడా..ఇక్కడ కూడా అంతే కష్టాలూ కన్నీళ్లూ అంటూ భారతీయులు కొత్త వైరస్ రాకతో బెంబేలెత్తిన తరుణాన ఆయన మన ప్ర జలకు తనదైన హామీ ఇచ్చారు. పూర్తి నాణ్యతతో కూడిన వ్యాగ్జిన్ ఒకటి తెరపైకి తీసుకువచ్చి తన బాధ్యతను నిర్వర్తించారు..దే శీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలి అని ప్రధాని చెబుతున్నారు..ముందు వారి కృషిని గుర్తించడం బాధ్యత తరువాతే ప్రోత్సాహం.. చేస్తున్నామా మనం..మన మది గదిలో ఇలాంటి వెలుగునీ వికాసాన్నీ ఆహ్వానిస్తే కొత్త వేకువల సృష్టి సాధ్యమే!
భారతీయ ప్రతిభనూ
కృషినీ కొనియాడండి
ఉదయం ఓ వైద్యుడి పలకరింపు..ఉదయం ఓ అరుణ కాంతి పలకరింపు.. మందులు మింగితే జబ్బులు నయం అవుతాయా..
నమ్మకం అయిన మాటలు వింటే జబ్బుల తీవ్రత అన్నది అంచనాకు వస్తుందా.. ఆధారిత ప్రయోగాలు కరోనా గురించి ఎన్నో చె ప్పాయి.. విటమిన్ డీ బిళ్లలు మింగితే జబ్బు దార్లోకి రాదు అని నెత్తీ నోరూ కొట్టుకున్నాయి.. నోరు కట్టుకుని బతికితే జబ్బు వ్యా ప్తి చెందదని చెప్పేయి.. కానీ ఇది కూడా పాటించని బాధ్యతరాహిత్యపు జనం అంటే ఏవగించుకుంటాను..కోప గించుకుంటాను.. క రోనా వేళ దేశంలో సెక్సు కోరికలు పెరిగిపోయాయని చదివేను.. కండోమ్ వాడకం పెరిగిపోయిందని చదివేను కానీ మహమ్మారి ని యంత్రణ విషయమై పౌరుల బాధ్యత మాత్రం పెరగలేదు అని నిర్థారించి దరిద్రగొట్టు మనుషులను చూసి నవ్వుకున్నాను.. ఛస్తే మారరు ఈ మనుషులు అని తిట్టుకున్నాను కూడా! సర్ ! చచ్చేక శవం ఇవ్వరు అని అంటే తీవ్రతను చూపించి భయాన్ని సృష్టిం చారా లేదు కదా! జబ్బు ఎంత తీవ్రతతో ఉందో జాగ్రత్తలూ అదే స్థాయిలో ఉండాలని నేర్పారు.. పాటించామా అయినా వైజ్ఞానికం మానవ తప్పిదాలను భరిస్తుంది.. మానవ తప్పిదాల కారణంగా పుట్టుకువచ్చిన జబ్బులనూ రోగాలనూ నియంత్రిస్తుంది..మంచి వైద్యుల రాక కారణంగా జబ్బులు నియంత్రణకు వస్తాయి.. డాక్టర్ కృష్ణ ఎల్లా తనను నమ్మండి అని వేడుకుంటున్నారు. పది శా తంలోపే కొవ్యాగ్జిన్ కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెబుతున్నారు.. ఆధార సహితంగా ..భారతీయులు భారతీయ టీకాను న మ్మండి.. భారతీయులు భారతీయ ప్రతిభనూ కృషినీ కొనియాడండి..ఆ పాటి కూడా చేయలేకపోతే మీరంతా శుద్ధ దండగమారి మనుషులు..పోయి చావండి ..
ప్రౌండ్ టు సే లైక్ దిస్
భాగ్యనగరి ఇప్పుడు ఆనందంగా ఉండాలి.. భారత్ బయోటెక్ వీధుల్లో ఈ ఆనందాలు అన్నీ ప్రతిక్షేపణకు నోచుకోవాలి. దిగులు భ యం ఆందోళన అన్నవి వద్దే వద్దని డాక్టర్ కృష్ణ ఎల్లా (భారత్ బయోటెక్ సీఎండీ) ఇస్తున్న భరోసాను అందుకోవాలి. కరోనా మ హ మ్మారి నుంచి దేశాన్ని రక్షించే స్థితిలో ఇవాళ హైద్రాబాద్ ఉంది. జినోమ్ వ్యాలీ ఉంది.. భారత్ బయోటెక్ ఉంది. కొత్త వ్యాధుల స వాళ్లను స్వీకరించే దశలో ఉంది. కొత్త టీకాల ఉత్పత్తికి సిద్ధంగా ఉంది. భారతీయులు ఈ విజయంలో వాటా అందుకోవాలి .. భా ర తీయులు కొత్త వ్యాధులనూ సవాళ్లనూ ఇంకాస్త తట్టుకోవాలి.. లేదా వ్యాధుల వ్యాప్తి నివారణకు ప్రభుత్వాలతో సహకరించాలి.. భా రతీయులు బాధ్యతా రాహిత్యాన్ని వీడేక నేను ఆనందిస్తాను..తుమ్మూ,దగ్గూ వచ్చేటప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇ బ్బంది తలెత్తనీయక ఎలా ప్రవర్తించాలో ఇంకా నేర్చుకోవడం లేదు కదా!వీళ్లంతా..అని అసహ్యించుకుంటాను..నలుగురు నడిచే చోట ఉమ్మి వేయడం తప్పిదమే కాదు నేరం కూడా అని గ్రహించలేకపోతున్నారు కదా!అప్పుడు ఇంకా అసహ్యించుకుంటాను.. వ్యాధుల పుట్టుక సంక్రమిత వ్యాధుల తీవ్రత ..అంటు రోగాల వ్యాప్తి వీటన్నింటిపై కనీస అవగాహన లేని భారతీయులు గుడిలో కాలక్షేపం చేస్తే తిడతాను. దేవుడు కదా!కావాల్సింది అంటే మతం కన్నా వైజ్ఞానిక స్పృహ అన్నది ఒకటి ఉంటే ఏమయినా చే యొచ్చు..మత విశ్వాసం నిరూపణ కాదు వైద్యం విశ్వాసం కాదు నమ్మకం..నిరూపణకు తూగిన నమ్మకం..విశ్వాసాలను నేను ర ద్దు చేయాలి అని అనను కానీ వైజ్ఞానిక శక్తులనూ సంబంధిత అవతరణనూ నడవడినీ ప్రోత్సహించకుంటే ఏవగించుకుంటాను.
ప్రాణాలు పోతున్నాయన్న గగ్గోలు కన్నా
ప్రాణాలు నిలపాలన్న ఆశయాలే ఎక్కువగా పనిచేస్తాయి
ఇకపై మన కార్యాచరణ మారితే ప్రకృతి ప్రకోపం తగ్గుతుంది..వైరస్లు అన్నీ ప్రయోగశాలల్లో కాదు ప్రకృతి నుంచే పుడతాయి. లేదా మానవ తయారీ వైరస్సులే ఇవి అనుకోండి అయినా విరుగుడు కూడా ప్రకృతి నుంచే కనుగోవాలి. మనం ఒంట్లో సత్తువను పెం చుకుని ప్రయాణించడం నేర్చుకుని అదే బండ బుద్ధితో కాసులు పిండుకోవడం ఓ సులువు పనిగా మార్చుకున్నాం. చుట్టూ ఉ న్నవాటిలో ప్రేమనూ ఆదరణనూ పొందక ఉండి ఉన్నాం. ఈ లాక్డౌన్ వేళలు మనుషులకు ఒళ్లు బద్ధకం పెంచి ఉన్నాయి.. ఆడవా ళ్ల శరీర కష్టం పెంచి పోయాయి.. అప్పుడు లాక్డౌన్ కానీ కరోనా వైరస్ ఉద్ధృతి కానీ మనకు ఏమీ నేర్పలేదన్న నిర్థారణలోనే నేను ఉన్నాను. అయినప్పటికీ మనం మనలానే ఉన్నా..మన మార్పు..ప్రకృతికి అనుగుణంగా లేకున్నా విజ్ఞాన శాస్త్రం మాత్రం తదేక దీక్షతో పనిచేసింది..ఆ మాటకు వస్తే ప్రపంచం మొత్తం తదేక దీక్షతో ఎదురు చూసింది..ప్రాణాలు పోతున్నాయన్న గగ్గోలు కన్నా ప్రాణాలు నిలపాలన్న ఆశయాలే ఎక్కువగా పనిచేస్తాయి. చేశాయి కూడా! ప్రయోగ వేదికలు అందుకు అనుగుణంగానే పనిచేస్తా యి..చేశాయి కూడా!మంచి వైద్యుడికి మంచి దేవుడి సాయం ఉంటుంది. అయినా దేవుళ్లలోనూ మంచి చెడూ ఉంటాయా? తెలి యదు కానీ ఉంటే బాగుంటుంది కదా!
ఓ కృతజ్ఞత ఓ ధన్యవాద
వైద్య శాస్త్రం ఇంకొంత వేగంగా పనిచేస్తే బాగుండేది..శాస్త్ర సంబంధ పనులు ఇంకొంత వేగం అందుకుని ఉంటే ఇంకా బాగుండేది..
మన నుంచి దూరం అయ్యే మనుషుల సంఖ్య తగ్గేది..విలువయిన మనుషులు లోకాన్ని వీడిన సందర్భాలు తగ్గేవి. కొన్ని కు టుంబాలు సంతోషాలకు దూరం అయ్యే సందర్భాలూ తగ్గేవి. వ్యాధులు కొన్ని నియంత్రణలోకి వచ్చాక సైన్సుపై నమ్మకం పుడు తుంది. వ్యాధుల వ్యాప్తిలో పుట్టిన ఆందోళనను సైన్సు..పై వాడి కన్నా వేగంగానే తిప్పి కొడుతుంది. దేవుడూ..సైన్సూ రెండూ ప రస్పర ఆధారితాలు..అలాంటి ఆధారిత స్వరాలు జీవ కోటికి సాంత్వన ఇస్తాయి..ప్రాణాలు ఫణంగా పెట్టి కలలను సాకారం చేసిన కొ న్ని బృందాలకు మనం జేజేలు చెప్పాలి. ఈ విజయం భారత్ బయోటెక్ ది..ఈ విజయం కరోనా పుట్టుక ను గుర్తించిన వారిది.. దా ని నియంత్రణకు కృషి చేసిన వారిది.. కొవ్యాగ్జిన్ రాక కరోనా నియంత్రణకు పనిచేసే టీకా.. మనుషులల్లో పరివర్తన తీసుకు వస్తుం దో లేదో కానీ కాస్తయినా జాగ్రత్త నేర్పితే బాగుండు. ఇకపై అయినా ప్రకృతి నుంచి ప్రేమను పొందండి మరణ శాసనంను కాదని చె ప్పాలని ఉంది. అయినా ప్రాణం ప్రకృతిది అయితే మరణం ప్రకృతిది కాకుండా ఎలా ఉంటుంది..? ఈ నేపథ్యంలో వైరస్ నియంత్రణ కు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఈ ఉదయాన వందనాలు చెల్లించాలి నేను..నాతో సహా మీరు కూడా.. కృష్ణ ఎల్లా కు వారి బృందానికి
ఓ కృతజ్ఞత ఓ ధన్యవాద..ఇతర పరిశోధక బృందాలకు కూడా..