శ్రీక్షేత్రమ్‌లో బ్రహ్మూెత్సవ వేడుకలు

విజ‌య‌న‌గ‌రం : ప్రముఖ భారతీయ తత్త్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రమ్‌లో కొలువైయున్న అష్టలక్ష్మీ సమేత ఐశ్వర్య వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పంచమ వార్షిక బ్రహ్మూెత్సవాలలో భాగంగా సోమవారం చతు:స్థానార్చన, ప్రాయశ్చిత్త హోమము, అష్టోత్తర శత కలశాభిషేకము, చక్రతీర్థం, విశేష అలంకార పూర్ణ అర్చావతార దివ్యదర్శనం తదితర కార్యక్రమాలు త్రిదండి దేవనాథ రామానుజ జీయర్‌స్వామి పర్యవేక్షణలో జరిగాయి. ఈ ఉత్సవంలో దేవాలయం ధర్మకర్తలు దుర్గాబాలాజీ, ఉమాదేవి దంపతులు, నీరజ మన్నే, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

(Visited 125 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.