సమర్థ వంతంగా రాష్ట్రంలో రీ సర్వే : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం :
రాష్ట్రంలో రీ సర్వే సమర్థవంతంగా నిర్వహించడానికి సర్వేయర్ ల పాత్ర కీలకమని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆదివారం ఆయన నివాసంలో ఆంద్రప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘం కాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భూముల సమగ్ర రీ సర్వే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తుందని అన్నారు. ఈ సర్వే లో రెవెన్యూ సర్వే ఉద్యోగులు తీరు అభినందనీయం అని ఆయన కొనియాడారు. త్వరితగతిన ఈ సర్వే పూర్తి చెయ్యడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర సర్వే ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఆర్ చిరంజీవి రావు,ఉపాధ్యక్షులు ఎం రాజేశ్వరరావు, రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలాచారి,అనకాపల్లి జిల్లా సర్వేయర్ ల సంఘం అధ్యక్షులు రావాడ త్రిమూర్తి,విశాఖపట్నం జిల్లా సర్వేయర్ ల సంఘం అధ్యక్షులు కనక బాబు తో పాటు శ్రీకాకుళం జిల్లా లోని సర్వేయర్ లసంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.