మార్నింగ్ రాగా : రి కనస్ట్రక్ట్ ద పాస్ట్
మెథడ్స్ అండ్ మోటివ్స్
ప్రాగ్దిశ ఎందుకు ఇంత పెద్ద మాట
వద్దు..తూరుపు సులువు
వేకువ సులువు
కువ కువ సులువు
రుతము అనడం సబబు కాదు
ఎందుకు అరుపు అని అనవోయ్
వసంతం కాదు కనుక కుహూరుతము అని కూడా అనకు
ఉన్నది రాలే కాలం ..కన్నీరు రాల్చే కాలం కాకుంటే మేలు
నిర్వచితం దుఃఖం నిర్వచితం అనుక్షణికం అనిర్వచితం లాక్షణికం
(లక్షణం చెడితే ఏమౌతుంది..ఉదయం లక్షణ సంబంధం ఐతే మేలు
అందుకే లాక్షణికం అని అన్నాను)
ఉదయాలు చలి గాలులకూ
ఇంటి గోడలకూ మధ్య ఏటవాలు తలాలు
వేకువలు వెచ్చని మంటలకూ
నిర్ణీత మౌనాలకూ మధ్య నిర్మిత దృశ్యాలు
రసా తలాలు అతల వితల రసాతలాలు ఊహా రేఖా విన్యాసాలు
దేశాలు ఆకాంక్షలకూ
ఆత్మ సంఘర్షణలకూ మౌనంగా నిలిచే సాక్షాలు
అక్షాంశాలూ రేఖాంశాలూ మధ్య తులతూగని నిశ్శబ్దాలు
ముహూర్తపు చిత్తాలు లేదా సమన్వయ ధోరణులు
యుద్ధాలు యుద్ధపు కౌగిళ్లకు ఆనవాళ్లు ఆ బిగి ఆ నుడి ఎలా ఉంటుంది?
దారులు క్రియాశీలతకూ
క్రియా రాహిత్యానికి మధ్య దూరాన్ని నిర్వచించే ప్రామాణికాలు
పత్రికలు అవసరాలకూ
అసంగతాలకూ మధ్య తమకు తాము పొందిన ఊపిరికి ఆనవాళ్లు
బిడ్డలు వీళ్లే మన రెక్కలు
చదివేను నవ్వాను
బిడ్డలు వీళ్లే మన రంగులు
చదివేను మళ్లీ నవ్వేను
బిడ్డలు విశేషం కాని విశేషం
మోసుకువచ్చిన బిడ్డలు
బిడ్డలు మన ఇంటి బిడ్డలు అయినా కాకున్నా
ఆ దారపు బంధం పోతుందని అనుకోలేం
చలి బాధ్యతా రాహిత్యంగా ఉంది
ఉదయం
దానికి కొనసాగింపు కాకుంటే మేలు
వీధి దీపం వెలుతురు కాస్త ప్రశాంతత
చీకటి నుంచి వేకువ వైపు ఊపిరి ఇంకాస్త నిశ్వాస
ఈ దారుల్లో..నెత్తుటి మరకలు చెరిపేస్తే చరిత్ర అని చెప్పని దారుల్లో
ఒక నిశ్వాస..కొత్త క్యాలెండర్ అండ్ కొన్ని సంగతులు ఇవాళ్టి మార్నింగ్ రాగాలో
మార్నింగ్ రాగా : రి కనస్ట్రక్ట్ ద పాస్ట్
ప్రేమా ద్వేషం
రెండూ ఉండాలి ఉంటేనే మేలు
మార్పు-తూర్పు వాకిట రావాలి..అని సంధానించారొకరు. యువ ఎంపీ కి ఇదే చెప్పేను..మన ప్రాంతం మన జీవితం అన్నవి మా త్రమే సంస్కరణకు నోచుకోవాలి. కానీ ఇది సాధ్యం కావడం లేదు. మార్పు మన పంచాయతీలో రావాలి..లేదా సంబంధిత చర్య అం దుకు సహకారి కావాలి. కానీ క్యాలెండర్ మార్పులు..కాలంలో మార్పులు..కొన్నింట ఏ మేలూ చేయడం లేదు..మన జీవితాల్లో మార్పులు రావు. రావాలి అనుకోవడం వెరీ రొటీన్..మన జీవితాల్లో వచ్చే వెలుగు అంతా కాలుష్య కాసర సంబంధం..మన చీకటే అత్యంత మేలు చేసే వస్తువు..కిశోర్ సర్! మీరు నిర్దయను వదిలి కాలాన్ని ద్వేషించడం మానుకోండి..అని అంటే నవ్వేను..ద్వేషం ప్రేమ రెండూ ఒకే చోట ఉంటాయని చెప్పేను.. ప్రేమ పరిష్కర్త అవుతుందో లేదో తేలియదు కానీ ద్వేషం సులువుగా ఒక నిర్ణయా త్మక శక్తి.. ప్రేమ సందేహాత్మకం కానీ ద్వేషం అంతిమం వరకూ ఆదేశపూర్వకం.. మరి! పాలనలో ఏముందని ప్రేమ ఉందా ద్వేషం ఉందా..దేశాన్ని ఎవరు ప్రేమిస్తే వారికే ప్రజల ప్రేమ.. ప్రబలమయిన ప్రేమ.. మారిన ప్రేమ కాదు మారని ప్రేమ అదే! సైనికుడి మర ణాన్ని ప్రకటనతో సరిపుచ్చక ఆ కుటుంబాన్ని ఆదుకుంటే అది ప్రేమ.. ఆ ప్రేమ విగ్రహ రూపం నుంచి వ్యక్తిత్వ నిర్మాణం వరకూ ఉంటూనే ఉంటుంది..అలాంటి ప్రేమ ఎవ్వరిలో ఉంటే వారే సిసలు నాయకులు.
కొన్ని ప్రతిపాదనలు
కొన్ని పరిష్కారాలు అలానే..
కాలం రాముడ్ని ప్రేమించడం నేర్పిందే అనుకోండి..ఆ కాలం అంతా మనుషులు అలానే ఉంటారా లేదా ఉన్నారా? అలాంటప్పుడు త్రేతా యుగాన చెడుకు తావే ఉండకూడదు కదా!స్మరణ అన్నది సంస్కరణ కాదు ఆచరణ మాత్రమే సంస్కరణ..విచిత్రం మన దే శంలో స్మరణనే గొప్పగా చూపి ఆచరణను వదిలి హాయిగా కాలం వెళ్లదీస్తారు. రాక్షస గుణాలు కాలం ప్రసాదించిందే అనుకోండి మీ రు వాటిని వద్దనుకుని రామ నామ స్మరణతో చెడు కాలా లను జయించడం నేర్చగలరా.. లేదు కదా!కనుక కాలం ఎలా ఉంటే అ లానే ఉండనీ..లేదా చెడు కాలాల నుంచి సంక్రమిత చెడు ను వద్దనుకోవడం చేయదగిన పని.. లేదా గత కాలాల పునః నిర్మా ణా లకు పూనిక వహించడం మరో పెద్ద పని.. చేయగలమా? వీలున్నంత మేర దేశంలో కదలిక తేవాలి..వీలున్నా లేకున్నా ఉద యా లు సంస్కరణ వాదం వినిపించాలి.. వాగడం కాదు అరవ డం ముఖ్యం కొన్ని సార్లు.. హా! వాక్కు కొన్ని సార్లు హక్కుగా మారితే ప్ర తిపాదన కొన్నిసార్లు మేలయిన పరిష్కారానికి ఆనవాలు. మన దేశాన ప్రతిపాదనలూ పరిష్కారాలూ అన్నీ పాలకుల చేతిలో నుం చి పార్లమెంట్ గుమ్మానికి చేరే లోపే ఏకపక్ష ధోరణి ఒకటి అమలుకు నోచుకుని ఉంటుంది.
హూ యామ్ యూ..
అండ్
హూ యామ్ ఐ..
కొత్త కాలానికి ఇది పాత..పాత రోజులకు ఇది కొత్త..నిర్మించాలి అనుకుంటే కొత్తను నిర్మించండి లేదా పాత కాలాలను పునరావృ తి చేయండి..పాత కాలం అనగా మంచి కాలం..మంచి గతాన కొంచెమే ఉందని చెప్పారొకరు..నవ్వుకున్నాను..ఉన్న కొంచెంకు కొ నసాగింపు ఈ పాలకులు చేస్తే చాలు కదా!అది కొంచెం అయినా కాకున్నా కొనసాగిం పు ఒకటి ముఖ్యం కదా అని! సీన్ రీ కన్ స్ట్ర క్షన్ ఉంటుంది అలానే టైం రీ కన్ స్ట్రక్షన్ కూడా కావాలి. కానీ మన పాలకులు గతంలో నిందలు వెతుకుతారు..నిజాలు పైకి తీసు కురారు..వస్తే మంచిది. ఉన్నదంతా ఉన్నతి హా హా తప్పు..లేనిదంతా చెడ్డది..అయ్యో!ఏడ్చేను..మంచి చెడులు అన్నవి పాలకు లకే కాదు ప్రజలకూ పట్టాలి..పడుతుందా..బాధ్యత అన్నది పాలకులకే కాదు ప్రజలకూ పడుతుందా హీ హీ హూ హూ
హూ యామ్ యూ హూ యామ్ ఐ..
విధానం మారితే
జీవితం ఏమౌతుంది డియర్ పాలకా!
గతాన్ని నిర్మించాలి..పునఃనిర్మించాలి..అలాంటప్పుడు కాలం ఏమౌతుంది..గతాన్ని విస్మరించమని చెబుతుందా? లేదా గతాన్నీ గాయాన్నీ వద్దనుకోమని చెబుతుందా?ఉదయం ఇంతటి వికాసాన్ని ఇచ్చి వచ్చిందని అనుకోను. క్యాలెండర్లో ఉన్నంత హాయి
జీవితంలో ఉంటే మేలు..రోజులు నడిచి వారాలు గడిచాక కూడా జీవితం మరింత కొత్త ఊహను కోరుకోవడం బాధ్యత..బాధ్యతగా ఉండడంలో నాయకులు ఉన్నారా? అక్కడే చిక్కు. ఉంటే మేలు..మన ఎంపీలూ ఎమ్మెల్యేలూ ఆ విధాన పనిచేస్తే మేలు. పని చే యాలి కూడా!
ఉద్దేశాలూ నిర్ణయాలు
ఉపదేశాలూ ఉపమానాలు
ఏదో ఒకటి నడపనీ!
బాధ్యత వైరస్ కన్నా కొన్ని సార్లు ప్రమాదకారి. బాధ్యత కాలం కన్నా ప్రమాదకారి కూడా…కావొచ్చు. తెలియదు..తెలివి..మన జీవి తాల్లో చీకట్లు ఉండాలన్నది కాలం ఆదేశం అయితే ఎవ్వరు ఏం చేయగలరని.. కానీ వెలుగుల రాక సంస్కరణకు ఆనవాలుగా ని లిస్తే ఆ రాకకు కారణం ఈ నాయకులూ ఈ ప్రభుత్వాలు అయితే అప్పుడు వీరికి స్వార్థం లేదు అని నిర్థారించి ఆనందిస్తాను. కానీ మన పార్లమెంటు..మన శాసన సభ అలా ఉందా..ఉంటుందా..చోదక శక్తులు అన్నీ ప్రజలకు అనుగుణంగా పనిచేస్తే క్యాలెండర్ లో వెలుగులు రంగులు సంఘటనలు అన్నీ అన్నీ కూడా బాగుంటాయి..వస్తున్న కాలం ఈ గతాన్ని వద్దనుకోదు..అప్పుడు గతం పు నఃనిర్మాణం చేయాలంటే చేయొచ్చు..మంచి కాలాల పునరావృతి ఓ ఆవశ్యక చర్య.. ఉద్దేశాలు అన్నీ మంచివయి నిర్ణయాలే మ రింత ప్రమాదకారులుగా ఉంటే కాలం ఉద్దేశాన్ని వదిలి నిర్ణయాలను మాత్రమే గుర్తు పెట్టుకోమని ఆదేశిస్తుంది..అలాంటి ఉద్దేశాలు గౌరవ పార్లమెంటులో ఉన్నాయి..అలాంటి ఉద్దేశాలు ఇంకెక్కడ చెలామణీలో ఉన్నాయో తెలియదు..కానీ కొత్త ఏడాది ఉద్దేశాలూ, నిర్ణయాలూ నిర్దయను ప్రదర్శించకుంటే మేలు. తెలివి..