ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో శిధిలావస్థలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం.: 60 గ్రామాలకు అందని వైద్య సేవలు

అనకాపల్లి  :

 

ప్రజా ఆరోగ్య పరిస్థితి ని మెరుగుపరచవలసిన అధికారులు వారి నిర్లక్ష్యం కారణంగా పేద ప్రజలకు వైద్యం అందని ద్రాక్ష గా మారింది. దీంతో అనారోగ్యం పాలైన ప్రజలు ఇక్కడి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి రావడానికి భయపడుతున్నారు.శిధిలావస్థలో ఉన్న ఈ ఆసుపత్రికి వస్తే ఎప్పుడు కుప్పకూలిపోతుందో‌ అని భయపడి ఈ ఆసుపత్రికి రోగులు తాకిఎఇ తగ్గిపోయింది. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులు తప్పని పరిస్థితుల్లో రాక తప్పడం లేదని స్థానికులు అంటున్నారు. అయితే ఇక్కడి ప్రాధమిక అరోగ్య కేంద్రం శిధిలావస్థలో ఉండటంతో ప్రభుత్వం నాడు నేడు క్రింద మరమత్తులు కోసం నిధులు మంజూరు చేసారు. దీంతో ఒక‌ కాంట్రాక్టర్ మరమత్తులు చెయ్యడానికి ముందుకు వచ్చారు. ఆసుపత్రి స్లాబ్ పెచ్చులను తీసి అర్థాంతరంగా పనులు నిలిపివెయ్యడంతో ఆసుపత్రి కి‌ కష్టాలు మొదలయ్యాయి.
దీంతో వర్షం కురిస్తే చాలు ఆసుపత్రి ప్రాంగణం అంతా జలమయం అవుతుంది. సుమారు అరవై గ్రామాలు నుండి రోగులు ఈ ఆసుపత్రి కి రోగులు వస్తుంటారు. అంతే కాకుండా అనంతగిరి మండలం నుండి కూడా గర్బిణి లు వైద్యం కోసం వస్తూ ఉంటారు. మెరుగైన వైద్యం అందించే వైద్యులు ఈ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నా ఆసుపత్రి శిధిలావస్థలో ఉండటం చేత సరైన వైద్యాన్ని అందించలేకపోతున్నట్లు అనుకటున్నారు.వర్షం లోనే రోగులకు‌ కాంట్రాక్టర్ మరమ్మత్తు పనులు మొదలుపెట్టారు. అయితే ఏమైందో ఏమో గాని ఆసుపత్రి పై స్లాబ్ చెక్కి ఆతర్వాత మరమ్మత్తు పనులు నిలిపి వేసారు. దీంతో ఆసుపత్రి వర్షం కురిస్తే చాలు ఆసుపత్రి ప్రాంగణం అంతా జలమయం అవుతుంది. సుమారు అరవై గ్రామాలు నుండి రోగులు ఈ ఆసుపత్రి కి రోగులు వస్తుంటారు. అంతే కాకుండా అనంతగిరి మండలం నుండి కూడా గర్బిణి లు వైద్యం కోసం వస్తూ ఉంటారు. మెరుగైన వైద్యం అందించే వైద్యులు ఈ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నా ఆసుపత్రి శిధిలావస్థలో ఉండటం చేత సరైన వైద్యాన్ని అందించలేకపోతున్నట్లు అనుకటున్నారు.ఇప్పటికైనా ప్రజా ఆరోగ్య వ్యవస్థను మెరుగు పరచాలని స్థానికులు కోరుతున్నారు.

(Visited 20 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.