మన్యం లో జాతీయ రహదారులు బాక్సైట్ తరలింపుకే. ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీపిసిసి)రాష్ట్ర అధ్యక్షుడు శైలజనాథ్.

చింతపల్లి:

మన్యంలో జాతీయ రహదారుల నిర్మాణం బాక్సైట్ తరలింపుకేనని ఆంధ్ర ప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) రాష్ట్ర అధ్యక్షుడు డా.సాకే శైలజానాథ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జన జాగరణ అభియాన్ మహాసభ పాడేరు నియోజకవర్గ భాద్యులు వంతల సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ మహాసభకు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాలలో గిరి మహిళలు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. ఆయా గ్రామాలకు కనీసం అంబులెన్స్ లు కూడా వెళ్లేందుకు చిన్నచిన్న రహదారులు నిర్మించ లేని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో మన్యంలో లభించే విలువైన బాక్సైట్ ను తవ్వుకుపోయేందుకే సువిశాలమైన నాలుగు లైన్ల రహదారులను నిర్మిస్తున్నారని ఆయనన్నారు. మన్యంలో పరిస్థితులు చూస్తుంటే రానురాను దుర్భరంగా మారుతున్నాయన్నారు. గిరిజనులకు కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయన్నారు. విలువైన ఖనిజ సంపదను దోచుకునే ప్రయత్నాలు చాపకింద నీరులా జరుగుతున్నాయన్నారు. ఇందుకోసమే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జాతీయ రహదారి నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. విశాఖపట్నం నుంచి భవిష్యత్తులో నిర్మించబోయే కర్మాగారాలకు ప్రత్యేక రైల్వే లైన్ వేసేందుకు ప్రణాళికలు జరుగుతుందన్నారు.దానిలో భాగంగానే సువిశాలమైన రహదారులు నిర్మిస్తున్నారన్నారు. కళ్ళ ముందే విలువైన చెట్లు,పంట భూములు,అటవీ సంపద నాశనం అవుతుందన్నారు. గిరిజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రజాప్రతినిధులు గిరిజనులకు జరుగుతున్న నష్టాలపై కనీసం నోరు మెదపడం లేదన్నారు. ప్రజలు నివాసం ఉంటున్న భూములు ఇళ్లకు శాశ్వత హక్కు పేరుతో రూ.10 వేలు వసూలు చేయడం దారుణమన్నారు. గిరిజనుల సమస్యలపై ప్రభుత్వాలపై మాట్లాడుకునే సమయం లేదని పోట్లాడుకునే సమయం ఆసన్నమైందన్నారు. అడవులనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆదివాసీలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి పల్లం రాజు,పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి, ఐఎన్ టియుసి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు, నర్సీపట్నం, అరకు నియోజకవర్గ ఇన్ఛార్జిలు మీసాల సుబ్బన్న, శాంతి కుమారి, పార్టీ సీనియర్ నాయకులు వీరన్నపాలెం(బాబులు), మొట్టడం బాలరాజు, సాగిన కృష్ణ పడాల్, లకే వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

(Visited 44 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *