మార్టూరు సచివాలయాన్ని సందర్శించిన అనకాపల్లి డిఆర్ఒ వెంకటరమణ
అనకాపల్లి :
మండలం లోని మార్టూరు గ్రామ సచివాలయాన్ని బుధవారం అనకాపల్లి జిల్లా డిఆర్ఓ వెంకటరమణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయ సిబ్బంది పనితీరు, ప్రజలకు అందించే సేవలను అలాగే బయోమెట్రిక్ పనితీరును వారు పరిశీలించారు.ఒటిఎస్ డాక్యుమెంట్ పనితీరును కూడా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలను అందించాలని సూచించారు. విధి నిర్వహణలో అలక్ష్యం తగదని అన్నారు. ఈయన వెంట సచివాలయ కార్యదర్శి వలివెల ఈశ్వరరావు, ఆర్ఐ రమేష్, విఆర్ఓ అప్పారావు, సచివాలయ సిబ్బంది సూర్య తేజ, సిరి చందన, దుర్గా ప్రసాద్ సూర్య,ప్రసాద్ ,తదితరులు ఉన్నారు.
(Visited 13 times, 1 visits today)