రీ సర్వే పని భారం పదింతలవుతోంది : జిల్లా సర్వేయర్ ల ఆవేదన జేసి కి వినతిపత్రం సమర్పణ

అనకాపల్లి కలెక్టరేట్  :

 

 

భూముల సమగ్ర రీ సర్వే కార్యక్రమంలో ఎదురౌతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జిల్లా సర్వే ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని సర్వేయర్ లు జాయింట్ కలెక్టర్ జాహ్నవి కి శనివారం వినతి పత్రాన్ని సమర్పించారు. రీ సర్వే లో విపరీతమైన పని భారం పదింతలు అవుతుందని‌ సర్వేయర్ లు ఆవేదనను వ్యక్తం చేసారు. దీని వలన తీవ్రమైన ఒత్తిడి కి గురవుతున్నామని సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేసారు. జాయింట్ కలెక్టర్ జాహ్నవి తో వీరు సమావేశమై సమస్యలను ఆమె దృష్టి కి తెచ్చారు. ఆదివారాలు ఇతర సెలవు దినాలను తమకు కూడా వర్తింప చెయ్యాలని నిర్ణీత పని వేళలను అమలు చెయ్యాలని డిప్యుటేషన్లను మండల పరిధికే పరిమితం చెయ్యాలని సంఘ నాయకులు కోరారు. ఎస్.ఒ.పి ప్రకారం ఆదేశించిన విభాగాలకు రీ సర్వే లో భాగస్వామ్యం కల్పించాలని కోరారు. సకాలంలో ప్రొబేషన్ ప్రకటించాలని బిఎల్ఒ భాద్యతలు నుండి తమను విముక్తి చెయ్యాలని కోరారు.

జెసి హమి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రీ సర్వే గడువు లోగ విజయవంతంగా పూర్త అయ్యేందుకు సహకరించాలని జెసి జహ్నవి సర్వేయర్ లను కోరారు. ఆదివారాలలో విధులు మినహాయింపు ఇచ్చేందుకు భూత్ లెవిల్ భాద్యతలు నుండి విముక్తి కల్పించేందుకు జెసి హమి ఇచ్చారు.మండల స్థాయి లోనే డిప్యుటేషన్లు ఉంటాయని ప్రొబేషన్లు,మహిళా ఉద్యోగులకు సదుపాయాలు విషయంలో న్యాయం చేస్తానని హమి ఇచ్చారు. సర్వేయర్ సంఘం అధ్యక్షులు రావాడ త్రిమూర్తులు, కార్యదర్శి మహేష్,డిఆర్ఒ వెంకటరమణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో సర్వేయర్ లు పాల్గొన్నారు.

(Visited 3,475 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.