సేవ‌చేయడంలోనే సంతృప్తి

విజ‌య‌న‌గ‌రం:సాటి వారికి సేవచేయడంలోనే సంతృప్తి లభిస్తుందని, దానికి విలువకట్టలేమని అలయన్స్ క్లబ్స్‌ అంతర్జాతీయ కార్యదర్శి బి.చక్రధరరావు అన్నారు. శనివారం ఉదయం ఎస్‌ వి ఎన్‌ లేక్‌పాలెస్‌లో డిస్ట్రిక్ట్‌-105 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మానవ జన్మ ఉత్కృష్టమైనదని, తనకున్నదాంట్లో ఇతరులకు సహాయపడడమే నిజమైన మానవత్వమని, ఆ దిశలో క్లబ్‌ సభ్యులు పయనించాలని పిలుపునిచ్చారు. గవర్నర్‌గా పిన్నింటి సూర్యనారాయణ, వైస్‌ గవర్నర్‌గా పెనుమజ్జి లుక్కునాథ్‌ ప్రశాంత్‌, కేబినెట్‌ సెక్రటరీగా గోటేటి హిమబిందు, రీజనల్‌ ఛైర్‌పర్సన్‌గా ఎం సుభద్రాదేవిలచే క్లబ్‌ అంతర్జాతీయ ఛైర్మన్‌ సముద్రాల గురుప్రసాద్‌తో కలసి చక్రధర రావు ప్రమాణ స్వీకారం చేయించారు. పూర్వగవర్నర్‌ గురాన అయ్యలు అధ్యక్షత వహించగా పెనుమజ్జి విజయలక్ష్మీ జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో సేవలందించిన వారికి క్లబ్‌ తరపున ప్రశంసాపత్రాలను పతకాలను ప్రదానం గావించారు. గవర్నర్‌ సూర్యనారాయణ, కళావతి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ బి టి మార్కెట్‌ పూర్వ అధ్యక్షులు పివి రామారావు, వాసవీవనితాక్లబ్‌ పూర్వ అధ్యక్షురాలు గిరిజా ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

(Visited 8 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *