సత్యనారాయణ సేవలు అభినందనీయం
అనకాపల్లి : విధి నిర్వహణలో సత్యనారాయణ మూర్తి సేవలు మరచిపోలేనివని అనకాపల్లి తహశీల్దారు ఎ. శ్రీనివాసరావు కొనియాడారు. బుధవారం అనకాపల్లి మండలం తుమ్మ పాల గ్రామ రెవెన్యూ అధికారిగా సత్యనారాయణ మూర్తి పదవీ విరమణ కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. మూర్తి తను పని చేసిన ప్రత చోట నిబద్ధతతో పనిచేసారని అయితే ప్రతి ఉద్యోగి కి పదవీ విరమణ తప్పదని అన్నారు. తన దైనందిక జీవితం సాఫీగా సాగాలని అన్నారు. డిప్యూటీ తహశీల్దారు వెంకట్ మాట్లాడుతూ మూర్తి అనకాపల్లిలో పనిచేసిన కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సకాలంలో రైతులకు పట్టా దారు పాస్ పుస్తకాలు అందించడంలో ప్రత్యేక శ్రధ కనపరిచారన్నారు. ఈ పదవీ విరమణ కార్యక్రమం లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు బేగం,ఈశ్వరరావు, జిల్లా విలేజ్ రెవెన్యూ అదికారుల సంఘం ఉపాధ్యక్షులు అనిమిరెడ్డి గణేష్, సహయ కార్యదర్శి వీరప్పారావు,అనకాపల్లి మండల విఆర్ఒల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గేదెల చలపతి,మోటూరి శేషగిరి,రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పలువురు పదవీ విరమణ చేసిన సత్యనారాయణ మూర్తి ని ఘనంగా సన్మానించారు.