అధికార పార్టీ విధ్వాంసాల‌ను అరిక‌ట్టండి

విశాఖపట్నం లో చారిత్రాత్మక రుషికొండను ధ్వంసం చేస్తున్నారని,సీ ఆర్ జడ్ నిబంధనలను ఉల్లంఘించి బీచ్ లను డంపింగ్ యార్డ్ లుగా మార్చేశారని,వేల సంవత్సరాల చరిత్ర వున్న ఎర్ర మట్టి దిబ్బలలో మైనింగ్ చేస్తున్నారని జివియంసి ఫ్లోర్ లీడర్ పీతల మూర్తియాదవ్ ఈరోజు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ని పోర్ట్ గెస్ట్ హౌస్ లొ కలిసి విన్నవించారు. ఐదవ షెడ్యుల్ పరిధిలోని మన్యం గ్రామలను పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోని తెచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విన్నవించారు. వంద కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం, దట్టమైన అడవుల తో నిండిన తూర్పు కనుమల తో విశాఖ ప్రకృతికీ పచ్చదనానికి చిరునామాగా ఉంటున్న సంగతి తెలిసిందేన ని. ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతమైన పచ్చని నగరం విశాఖ అని ఇక్కడే విద్యాభ్యాసం చేసిన తమరికి విశాఖ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని , అయితే దురదృష్టవశాత్తు విశాఖ అందాలన్నీ విధ్వంసం అయిపోతున్నాయని. విశాఖ అనగానే పర్యాటకులకు గుర్తుకు వచ్చే రుషికొండ అంతర్ధానమైపోతుందని, వందలాది సంవత్సరాల క్రితం ఋషులు, మునులు తపస్సు చేసిన కారణంగా ఆ కొండకు రుషికొండ అనే పేరు వచ్చిందని , దానికి అనుబంధంగా అక్కడ ఆలయ సముదాయాలు కూడా ఉన్నాయని మూర్తి తెలిపారు . ఇంత చరిత్ర కలిగిన రుషికొండ ను నిజానికి భారత ప్రభుత్వం పురావస్తు సంపదగా గుర్తించాలి. అలా గుర్తించకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కాటేజీలు, హోటల్ ల నిర్మాణం పేరిట ధ్వంసం చేసింది. పాత కాటేజీల స్ధానం లో కొత్తవాటికి పరిమితం కాకుండా కొండ చుట్టూ నిర్మాణం పేరిట పెద్ద ఎత్తున తవ్వకాలు చేస్తున్నారు. ఈ కారణంగా ప్రకృతికి పర్యావరణానికి జీవ వరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. విశాఖ అనగానే గుర్తుకు వచ్చే పర్యాటక కేంద్రంఅయిన రుషికొండ ఇకపై కేవలం భవన సముదాయంగా మాత్రమే మిగిలనుంది.

రుషికొండ ను ధ్వంసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ పాలకులు అక్కడ తీసిన వేలాది టన్నుల మట్టిని కోస్తా నియంత్రణ మండలి నిబంధనలకు విరుద్ధంగా సముద్రంలో పోస్తున్నారు. రుషికొండ నుంచి భీమిలి వరకు ఉన్న రహదారికి సముద్రం వైపున వున్న బీచ్ లను వేలాది లారీల మట్టితో కప్పేస్తారు. కోస్తా నియంత్రణ మండలి నియమ నిబంధనల ప్రకారం సముద్రం మట్టం నుంచి 500 మీటర్ల వరకు ఎటువంటి కార్యక్రమాలు కార్యకలాపాలు చేయరాదు. అందుకు విరుద్ధంగా ఇసుక తిన్నెలపై మట్టి వేస్తూ సముద్ర జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నారు. రక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే ఉల్లంఘనలకు లకు పాల్పడటం దారుణం. భారత ప్రభుత్వం వెంటనే ఈ వ్యవహారాలపై జోక్యం చేసుకొని సుందరమైన విశాఖను విద్వంసం నుంచి రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారతదేశంలోని అత్యంత అరుదైన ఎర్ర మట్టి దిబ్బలు అధికార పార్టీ నేతల దాహానికి బలై పోతున్నాయి. ఎర్ర మట్టి దిబ్బలకి సమీపంలో లేఅవుట్లు వేసిన కొందరు అధికార పార్టీల నేతలు ఎర్రమట్టిదిబ్బలు లోనే తవ్వకాలు జరిపి అక్కడి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా జోక్యం చేసుకొని దీనిని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ అధికార పార్టీ నేతల ఒత్తిడి వల్ల దోషులపై చర్యలు తీసుకోలేదు. తరచుగా రాత్రి సమయాల్లో ఎర్రమట్టిదిబ్బలు ప్రాంతంలో మైనింగ్ జరుగుతుంది. వీటిపై దృష్టి సారించాలని పీతల మూర్తి యాదవ్ విజ్ఞప్తి చేశారు .

దీంతోపాటు రాష్ట్రపతి ప్రత్యేక అధికారుల ద్వారా గవర్నర్ పాలనలో ఉండే ఏజెన్సీ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పట్టణ అభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకు వచ్చింది. ఐదవ షెడ్యూల్ పరిధిలో ఉన్న భూములను పట్టణ అభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకురావడం చట్టవిరుద్ధం . గిరిజనులు ఆదివాసీ సంఘాలు చెబుతున్న పట్టించుకోకుండా గిరిజన గ్రామాల స్వభావాలను మార్చే ప్రయత్నం నాతవరం మండలం లో చేస్తున్నారు. ఈ రాజ్యాంగ ఉల్లంఘనలపై భారత ప్రభుత్వం జోక్యం చేసుకునే విధంగా సిఫార్సు చేయగలరని ఆయన విజ్ఞప్తి చేశారు .

(Visited 17 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.