పెట్రోల్ డీజిల్ దోపిడీకి ముగింపు పలకండి
తెలుగుదేశం మీడియా కోఆర్డినేటర్ కొణతాల వెంకటరావు
అనకాపల్లి :కరోనా మహమ్మారి సంక్షోభంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రైల్వే ఆర్టీసీ రేట్లను పెంచి నేటికి కూడా సాధారణ రైలు ఎక్స్ ప్రెస్ రైలు తిరగకుండా స్పెషల్ ట్రైన్ లు పేరుతో అధిక రేట్లు వసూలు చేస్తున్నారని దేశం మొత్తం కరోనా ముందు ఏ విధంగా ఉందో ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నప్పటికీ దోచుకోవడమే విధాన నిర్ణయం గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం మీడియా కోఆర్డినేటర్ కొణతాల వెంకటరావు విమర్శించారు. ప్రజలు ఆదాయాలు కోల్పోయి ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్న ప్రజలను అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను రోజు వారి పెంచుకుంటూ పోతున్నారని వెంకటరావు తెలిపారు ప్రతిరోజు పెరుగుతున్న ఇంధన రిటైల్ ధరలతో అనేక నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర 93 రూపాయల నుండి 100 రూపాయలకు పెరిగే పరిస్థితి కనబడుతుందని దీనికి కారణం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడమే దీనికి కారణం అంటూ ఆయిల్ కంపెనీలు ప్రభుత్వాలు సమర్థించు ఉంటున్నాయని వెంకటరావు అన్నారు. ప్రధానంగా పెట్రోలియం ఉత్పత్తులపై అన్యాయమైన కేంద్ర పనులే 2014-15,20-21 ఈ మధ్య కాలంలో భారత్ కొనుగోలు చేసే ముడిచమురు ధర 17.6 శాతం పెరిగింది అదే సమయంలో దేశంలో సగటు రిటైల్ అమ్మకం ధర ఏకంగా పెట్రోల పై 55.3 శాతం డీజిల్ పై 72.5 శాతం పెరిగిందని ప్రపంచ ధరల స్థాయి కన్నా దేశంలో రిటైల్ ధర లో అనేక రెట్లు అధికంగా పెరిగాయని స్పష్టమవుతుందని వెంకటరావు తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో పన్నుల ఆదాయం నిర్దేశిత లక్ష్యం కన్నా బాగా తగ్గిందని అయితే ఎక్సైజ్ సుంకాల మాత్రం దీనికి మినహాయింపు లక్ష్యం కన్నా మొత్తం పన్నుల ఆదాయం 17.8 శాతం కన్నా తక్కువగా ఉండగా మరోవైపు ఎక్సైజ్ సుంకాల మాత్రం లక్ష్యాలను మించి 35 శాతం అధికంగా ఉన్నాయి పెట్రోలు డీజిల్ ఎల్పీజీ ధరలు పెరుగుదల అన్ని తరగతుల ప్రజల పై ప్రభావం చూపుతుందని అయితే ఉద్యోగాలు ఉపాధి కోల్పోయిన ప్రజలపై అత్యంత తీవ్రమైన ప్రభావం చూపుతుందని సరుకుల రవాణా పై ఆధారపడిన చిన్న వ్యాపారస్తులు దుకాణదారులు విక్రయదారులు తమ వస్తువుల ధరలు పెంచక తప్పడం లేదని రైతులు ట్రాక్టర్ పంపులకు డీజిల్ కోసం అధికంగా చెల్లింపులు చేయవలసి వస్తుందని రోజువారి వేతనం పై ఆధారపడిన అసంఘటిత రంగాల్లోని కార్మిక రవాణా చార్జీలు పెరుగుతున్నాయి ప్రైవేటు ప్రభుత్వ రవాణా ఖర్చులు ఎల్ పి జి సిలిండర్ల ధరలు పెరగడంతో మధ్యతరగతి ప్రజలపై బడ్జెట్ తలకిందులు అవుతుందని ఇకనైనా ప్రజలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఏకోన్ముఖంగా కేంద్రం పై పోరాటం చేస్తేనే తప్ప ధరల నియంత్రణలోకి వచ్చే పరిస్థితి కనపడటం లేదని వెంకటరావు అన్నారు.