తెలంగాణాలో రేపటి నుండి 6, 7, 8 విద్యార్థులకు తరగతులు

                                               

                                                    (జి. సాయి ప్రసాద్, హైదరాబాద్:9948335577)

తెలంగాణలో బుధవారం నుంచి ఆరు, ఏడు, ఎనిమిదో తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు విడుదల అయ్యాయి. అయితే తరగతులను రేపటి నుంచి మార్చి ఒకటో తేదీలోగా ప్రారంభించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులు కొవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదే విధంగా తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఇప్పటికే పాఠశాల స్థాయిలో 9, 10 తరగతులతో పాటు ఇంటర్‌, గ్రాడ్యుయేషన్‌, పీజీ కోర్సుల్లోని విద్యార్థులందరికీ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన విషయం తెలిసిందే.

(Visited 57 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *