రైతు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల్సిందే…

ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తుగా జిల్లా వ్యాప్తంగా బంద్ పాటించారు. అన‌కాప‌ల్లి, విశాఖ‌ప‌ట్నం, పాడేరు, చోడ‌వ‌రం, అర‌కు,పాయ‌క‌రావుపేట‌, నర్సీప‌ట్నం త‌దిత‌ర ప్రాంతాల్లో రైతు సంఘాలు, వామ‌ప‌క్షాలు ఆందోళ‌న నిర్వ‌హించాయి.

విశాఖ‌ప‌ట్నం: కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చేసిన రైతు వ్యతిరేక 3 చట్టాలను రద్దుచేయాలని, విద్యుత్ సంస్కరణ బిల్లును రద్దుచేయాలని కోరుతూ రైతు సంఘాల ఐక్యవేదిక ఈరోజు చేపట్టిన భారత్ బంద్ కు విశాఖపట్నం ఉక్కు అఖిల పక్ష కార్మిక సంఘాల ఐక్యవేదిక మద్దతు గా స్టీల్ప్లాంట్ టిటిఐ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు.
కేంద్రంలో నరేంద్ర మోడీ తీసుకువచ్చిన మూడు వ్యవసాయక చట్టాలు చాలా ప్రమాదకరమైనవని,ఈ చట్టాల వలన అధానీ రిలయన్స్ లాంటి కంపెనీలు వ్యవసాయాన్ని నిర్ధేశిస్తాయని, చిన్న రైతులు క్రమేనా వ్యవసాయాన్ని వదులుకోవాల్సి వస్తుందని, పంటలు నిలువ చేసుకోవడానికి రైతులు హక్కును కోల్పోతారని, శీతలగిడ్డంగులపై కార్పొరేటర్ల హజమాయిసీ వుంటుందని, విద్యుత్ సంస్కరణల వలన ఉచిత విద్యుత్ ను కోల్పోతారని తెలిపారు.
వీటిపై దేశ రాజధాని డిల్లీ లో పది రోజులుగా లక్షలాది రైతులు పోరాడుతున్నారని, మనకు అన్నం పెట్టే రైతులకు మేలు జరగడానికి మనమంతా వారికి సంఘీభావం తెలిపి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని తెలిపారు.
రైతులు కోరుతున్న అత్యంత న్యాయమైన డిమాండ్లను పరిస్కరించాల్సిన మోడీ ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా నడుచుకుంటుందని దీనిని నిరసిస్తూ ఈరోజు చేపట్టిన భారత్ బంద్ ను విజయవంతం చేసి దేశానికి వెన్నుముఖ అయిన రైతును కాపాడుకుందామని తెలిపారు.


ఓ వైపు ప్రభుత్వరంగ సంస్దలను మార్కెట్లో వేలానికి వుంచిందని,నేడు ఎన్నో వ్యయప్రయాలకు లోనై వ్యవసాయం చేసే రైతు కన్నీరు పెట్టడం దేశ సౌభాగ్యానికి అంత మంచిది కాదని వక్తలు తెలిపారు.
ఈకార్యక్రమంలో జె.అయోద్యరాం, గంధం వెంకట్రావు,డి ఆదినారాయణ,బి మురళీరాజు,పరందామయ్య, సంపూర్ణం, వైటి దాసు,విల్లూరి మహాలక్ష్మి నాయుడు,ఎన్ రామారావు,మహాలక్ష్మి నాయుడు,కె.సత్యనారాయణ, గణపతి రెడ్డి,డివి రమణారెడ్డి,డి మోహన్,సుబ్బయ్య,ఎమ్ శ్రీనివాసరావు,అప్పారావు ,డి సురేష్,ఎస్ నర్సింగరావు, డి సి హెచ్ వెంకటేశ్వరరావు ,కోరాడ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు

(Visited 30 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *