సోడియం హైపో క్లోరైడ్ పిచికారి

స్టీల్ ప్లాంట్ ఉక్కు నగరం లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావకం పిచికారి ని 78 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగా రావు మాట్లాడుతూ ఉక్కు నగరం లో కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవడం లో భాగంగా దీన్ని పిచికారి చేస్తున్నామని ఆయన అన్నారు. ముందుగా దీన్ని సెక్టర్-6 క్వార్టర్ నెంబర్:330/B లో స్టీల్ ప్లాంట్ ఉద్యోగి కరోనాతో మృతి చెందారని ఆ వ్యాధి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి సోకకుండా ఈ ప్రాంతాన్ని ఈ ద్రావకం తో శుభ్రపరిస్తున్నమని ఆయన వివరించారు. దీని కోసం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆర్ రాజేశ్వరరావు అనే ఉద్యోగి నియమితులయ్యారు అని ఆయన అన్నారు. ఈ సదుపాయం కావలసిన వారు “8688164018”నెంబర్ ని సంప్రదించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన వివరించారు. ఈ మహమ్మారి నుండి మనలను మనం కాపాడుకోవడానికి వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుని ఇంట్లోనే ఉండాలని ఆయన మనవి చేశారు.ఈ కార్యక్రమంలో స్టీల్ డివిజన్ సిపిఎం కార్యదర్శి కె.యమ్. శ్రీనివాస్, ఆర్. రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

(Visited 28 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.