21న ఎస్ పి బాలు స్వరసంస్మరణ సభ
ప్రశాంతి సంగీత వాద్యశిక్షణాకళాశాల, విజయనగరం ఆధ్వర్యంలో సంస్థ ద్వితీయవార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు గురజాడ కళాభారతిలో బ్రతుకంతా ప్రతినిముషం- మీ పాటలాగ సాగాలి అనే పేరుతో సినీసంగీత విభావరిని ఏర్పాటు చేస్తున్నామని సంస్థ వ్యవస్థాపకులు ఎలిశెట్టి రామమోహనరావు అన్నారు. గురజాడ అప్పారావు రోడ్డులో గల సంస్థ కార్యాలయంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధవళసర్వేశ్వరరావు, సముద్రాల గురుప్రసాద్లతో కలసి ఆహ్వానప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల 47వ వర్ధంతి మరియు అపూర్వ గాయకుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం స్వరసంస్మరణ సభను ఏర్పాటు చేసి మూడుగంటల పాటు మధురమైన గీతాలతో సినీసంగీత విభావరి ఉంటుందని రసజ్ఞులైన సంగీతాభిమానులు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ఎస్ కె బాషా, పాపారావు, రమణారావు తదితరులు పాల్గొన్నారు.