క్రీడారంగంనుండి కేంద్రమంత్రి వరకు
(11న కేంద్ర సహాయమంత్రి శ్రీ రావ్ ఇంద్రజిత్ సింగ్ జన్మదినం సందర్భంగా)
భారతదేశానికి కామన్వెల్త్ షూటింగ్లో బంగారు పతకాలను సాధించడమే కాదు. రాజకీయరంగంలోను అద్వితీయంగా శ్రీ రావ్ ఇంద్రజిత్ సింగ్ రాణిస్తున్నారు. ఇంద్రజిత్ సింగ్ 1950 ఫిబ్రవరి 11వ తేదీన హర్యానా రాష్ట్రంలో రేవారి అనే ప్రాంతంలో జన్మించారు. ఆయన తండ్రి రావు బీరేంద్రసింగ్ హర్యానా రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఇంద్రజిత్ సింగ్ ప్రాధమిక విద్యాభ్యాసం సనావర్ లారెన్స్ స్కూల్లో జరిగింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టాను సాధించారు. అద్భుత షూటర్‌గా పేర్గాంచిన ఇంద్రజిత్ సింగ్ కామన్వెల్త్ షూటింగ్ పోటీల్లో బ్రాంజ్ మెడల్ సాధించారు. మూడు సంవత్సరాలు పాటు వరుసగా నేషనల్ ఛాంపియన్‌గా నిలిచారు. శాప్ గేమ్స్‌లో మూడు బంగారు పతకాలు సాధించారు.
కాలము పరిణామాలు
1977 హర్యానా అసెంబ్లీకి ఎన్నిక
1982 హర్యానా అసెంబ్లీకి ఎన్నిక
1986 హర్యానా అసెంబ్లీలో ఆహారం మరియు పౌర సరఫరాల శాఖకు మంత్రిగా
1990 నుండి 2003 వరకు భారత షూటింగ్ జట్టులో సభ్యులు
1991 హర్యానా అసెంబ్లీకి ఎన్నిక
1998 లోక్‌సభకు ఎన్నిక
2000 లోక్‌సభకు ఎన్నిక
2004 హర్యానా అసెంబ్లీకి ఎన్నిక
2004 రాష్ట్ర విదేశీ వ్యవహారాలు, డిఫెన్స్ ప్రొడక్షన్స్ శాఖలకు మంత్రిగా
2004 లోక్‌సభకు ఎన్నిక
2009 లోక్‌సభకు ఎన్నిక
2014 భాజపాలో చేరిక
2014 గుర్గావ్ నియోజక వర్గం నుండి లోక్‌సభకు ఎన్నిక
2014 మే 26వ తేదీన స్టాటస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్,
ప్లానింగ్ అండ్ ఢిపెన్స్ శాఖలకు (మినిస్టర్ ఆఫ్ స్టేట్) గా
2016 జూలై 5 నుండి ప్రణాళికలు, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖలకు
కేంద్ర సహాయమంత్రిగా
1998లో తొలిసారిగా హర్యానాలోని మహేంద్రగర్ నియోజక వర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీచేసిన ఇంద్రజిత్సింగ్కు 3,29,126 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్ధి భారతీయ జనతాపార్టీ అభ్యర్ధి కలనల్ రామ్‌సింగ్‌కు 2,60,990 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో ఇంద్రజిత్‌సింగ్ 68,136 ఓట్ల ఆధిక్యత దక్కించుకున్నారు.2004లో హర్యానాలోని మహేంద్రగర్ నియోజక వర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీచేసిన ఇంద్రజిత్సింగ్కు 3,58,714 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్ధి భారతీయ జనతాపార్టీ అభ్యర్ధి డాక్టర్ సుధా యాదవ్‌కు 1,48,373 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో ఇంద్రజిత్‌సింగ్ 2,10,341 ఓట్ల భారీ మెజార్టీ లభించింది.2009లో హర్యానాలోని గుర్గావ్ నియోజక వర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీచేసిన ఇంద్రజిత్సింగ్కు 2,78,516 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్ధి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్ధి జాకీర్ హుస్సేన్‌కు 1,93,652 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో ఇంద్రజిత్‌సింగ్ 84,864 ఓట్ల భారీ మెజార్టీ లభించింది.2014లో హర్యానాలోని మహేంద్రగర్ నియోజక వర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్ధిగా పోటీచేసిన ఇంద్రజిత్సింగ్కు 6,44,780 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్ధి ఇండియన్ లోక్‌దళ్ పార్టీ అభ్యర్ధి జాకీర్ హుస్సేన్‌కు 3,70,058 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో ఇంద్రజిత్‌సింగ్ 2,74,722 ఓట్ల భారీ మెజార్టీ లభించింది.2019లో హర్యానాలోని మహేంద్రగర్ నియోజక వర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్ధిగా పోటీచేసిన ఇంద్రజిత్సింగ్కు 8,81,546 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్థికాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కెప్టెన్ అజయ్‌సింగ్‌కు 4,95,290 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో ఇంద్రజిత్‌సింగ్ 3,86,256 ఓట్ల భారీ మెజార్టీ లభించింది.రావ్ ఇంద్రజిత్ సింగ్ ప్రస్తుతం భారత ప్రధానమంత్రి మోదీ కేబినెట్లో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు, ప్రణాళికా శాఖా సహాయమంత్రిగా వ్యవహరిస్తున్నారు.