కోడూరు గ్రామంలో ఘనంగా రాములవారి ఎనిమిదవ వార్షికోత్సవం

అనకాపల్లి  :

 

 

మండలం లోని కోడూరు గ్రామంలో సీతారాములు దేవాలయం 8వ వార్షికోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ చినజియార్ స్వామి వారి మంగళ శాసనాలు సీతారాములు వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త సేనాపతి సూర్యనారాయణ దంపతులు ఆధ్వర్యంలో ఈ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. కాగా ఈ వేడుకలకు అనకాపల్లి ఎంపిపి గొర్లి సూరిబాబు, కోడూరు గ్రామ సర్పంచ్ సేనాపతి లక్ష్మి శ్రీనివాసరావు ముఖ్య అతిథులు గా పాల్గొన్నారు.అనంతరం అన్నసమారాధన కార్యక్రమాన్ని అనకాపల్లి ఎంపిపి గొర్లి సూరిబాబు ప్రారంబించారు. ఈ కార్యక్రమం లో సేనాపతి దేముళ్లు,చిట్టి సూరిబాబు, సేనాపతి సూరిబాబు, గొన్ని బత్తుల ప్రసాద్, సేనాపతి కేశవరావు, బంటు రమణ,హెల్పింగ్ హేండ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

(Visited 35 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *