20న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ యాత్ర

జీవీఎంసీ గాంధీ విగ్ర‌హం నుంచి స్టీల్‌ప్లాంట్ వ‌ర‌కూ
రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీ‌నివాస‌రావు

విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోరుతూ ఈ నెల 20వ తేదీన జీవీఎంసీ ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం నుండి నగరంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుకొంటూ స్టీల్ ప్లాంట్ వరకూ 25కిలోమీటర్లు దూరంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూవిశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సీఎంతో పాటు తామంతా వ్యతిరేకమని చెప్పారు.గతంలో చంద్రబాబు నాయుడు 50 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటీకరణ చేసినప్పుడు. అప్పటి ప్రతిపక్ష నేత రాజశేఖర్రెడ్డి ఎలా వ్యతిరేకించారో నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా అలాగే వ్యతిరేకిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. 13 కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి వారికి సంఘీభావం తెలుపుతూ ప్లాంట్ ఎదుట ప్రజాప్రతినిధులంతా ధర్నాలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. అతి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కార్మిక సంఘాల నేతలు సమావేశం కానున్నారని చెప్పారు. అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని తెలిపారు.స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలిసేందుకు ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయానికి తెలియజేయడం జరిగింది అన్నారు20 తేదీ ఉదయం 8.30 నిమిషములకు గాంధీ విగ్రహం దగ్గర నుంచి యాత్ర మొదలు కానుందని యాత్ర ముగిశాక కూర్మన్నపాలెం జంక్షన్లో భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు.

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసీపీ మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రేవేటికరణ ను వ్యతిరేకిస్తోందని ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీ లేఖ రాశారని స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు వైసీపీ పార్టీ ముందు ఉండి పోరాడుతోందని తమతో వచ్చే వారిని కలుపుకుంటు ముందుకు వెళ్తామన్నారు. చిత్తశుద్ధి తో ముందుకు వెళ్తుంటే చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రిని విదేశీ ప్రతినిధులు కలవడం సహజమని, ఎక్కువుగా విదేశీ ప్రతినిధులను కలిసే నైజం చంద్రబాబు నాయుడుకే ఉందన్నారు. అచ్చంనాయుడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని . ఆయన రెండు సార్లు జైల్ కి వెళ్లి వచ్చిన బుద్ధి రాలేదన్నారు. లోకేష్ కు రాష్ట్ర ప్రయోజనాలు కంటే రాజకీయ ప్రయోజనలు ముఖ్యమని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దీక్ష చేస్తుంటే సంఘీభావం తెలపడానికి వచ్చిన లోకేష్ ప్రక్కనే దీక్ష చేస్తున్న కార్మికులను కలవలేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు కి చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీ కి లేఖ రాయాలని సవాల్ విసిరారు.స్టీల్ ప్లాంట్ విషయం లో చంద్రబాబు రాజకీయాలను ప్రక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తో కలసి రావాలన్నారు.ఈ సమావేశంలో ఎంపిలు సత్యనారాయణ, సత్యవతి, ఎమ్మెల్యేలు బాబురావు, నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వెంకట్రామయ్య,కె. కె. రాజు, గురుమూర్తి రెడ్డి ఇతర నేతలు వంశీ, రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

(Visited 53 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *