నిత్య పఠనం ఉన్నతికి సోపానం

-లేళ్ల వేంకటేశ్వరరావు


విజ‌య‌న‌గ‌రం :నిత్య పఠనం ఉన్నతికి సోపానం అని ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ లేళ్ల వేంకటేశ్వరరావు అన్నారు. అలయన్స్‌క్లబ్స్‌ ఇంటర్నేషనల్‌ డిస్ట్రిక్ట్‌-105 మరియు ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం సంయుక్తంగా సత్యా ఇనిసిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌(సీతం) కాలేజీలో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మంచి పుస్తకం విజ్ఞానాన్ని అందిస్తుందని, మార్గ నిర్దేశం చేస్తుందని అటువంటి పుస్తకాలు కొలువైయున్న గ్రంథాలయం దేవాలయం వంటిదని అన్నారు. కార్యక్రమంలో తొలుత సీతంకాలేజీ డైరక్టర్‌ డాక్టర్‌ ఎం శశిభూషణరావు జ్యోతిప్రజ్వలనం చేసి నేటి యువత జీవితంలో ఎదిగేందుకు పుస్తకాలు ఎంత దోహదపడతాయో సోదాహరణంగా వివరించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన డాక్టర్‌ డొల్లుపారినాయుడు, నక్కా దామోదరరావులు మాట్లాడుతూ మంచి పుస్తకాలు చిత్తుకాగితాల దుకాణాల్లోనూ, ఫుట్‌పాత్‌ల మీదా కాకుండా సాహితీ ప్రియుల అరచేతుల్లో ఉండాలని అన్నారు. అనంతరం జిల్లాలో వివిధ ప్రభుత్వ గ్రంథాలయాల్లో ఉత్తమ సేవలందిస్తున్న గ్రంథ పాలకులకు అలయన్స్‌క్లబ్‌ అంతర్జాతీయ కమిటీ ఛైర్మన్‌ సముద్రాల గురుప్రసాద్‌, విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి లలితలు ప్రశంసాపత్రాలను, పతకాలను అందచేసారు. ఈ కార్యక్రమంలో వాసవీ వనితాక్లబ్‌ పూర్వ అధ్యక్షురాలు గిరిజా ప్రసన్న, సీతం కాలేజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ డి.వి.రామమూర్తి,క్లబ్‌ కేబినెట్‌ సెక్రటరీ హిమబిందు, ప్రాంతీయ అధ్యక్షురాలు సుభద్రాదేవి, సీతంకాలేజీ గ్రంథాలయ విభాగం అధిపతి డాక్టర్‌ ఎల్‌ సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

 

(Visited 100 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *