షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల జీతాల బకాయిలు విడుదల
తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ( వి.వి.రమణ కోపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ) పరిష్కారం నిమిత్తం 2018 నుంచి కార్మికులు, తాత్కాలిక ఉద్యోగుల ల జీతాలు బకాయిలు ఉన్నాయి దీనిమీద అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ పలుసార్లు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై స్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది అందుకు గత అసెంబ్లీలో కూడా దీనికోసం ప్రస్తావించడం జరిగింది అదేవిధంగా ఈనెల 20 న జరిగిన అసెంబ్లీలో కూడా షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు బకాయిల గురించి ప్రస్తావించగా వీళ్ళకి తక్షణమే నిధులు కేటాయించాలని సంబంధిత మంత్రి గారికి ఆదేశాలివ్వడం జరిగింది… ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు గారు మాట్లాడుతూ ఈ అంశంపై వారం రోజుల్లో పరిష్కార దిశగా ప్రయత్నిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.. గతంలో కూడా అమర్నాథ్ గారు చెరుకు రైతుల బకాయిలను పూర్తిస్థాయిలో విడుదల చేయించి ఇవ్వడం జరిగింది.. ఈ విషయంపై అమర్నాథ్ స్పందిస్తూ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు 30 మంది పర్మనెంట్ కార్మికులు, 300 మంది తాత్కాలిక ఉద్యోగులకు కూడా సుమారు 4 కోట్ల రూపాయలు బకాయిలను విడుదల చేయించి వారంలోగా జీతాలు అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారని వైసిపి పట్టణ పార్టీ కార్యాలయం నుండి ఒక ప్రకటన వెలువడింది…..