తారు మారింది..!

VDREAMS వార్త‌కు స్పంద‌న‌


జ‌నావాసాల మ‌ధ్య అన‌కాప‌ల్లి రోడ్లు భ‌వ‌నాల శాఖ బంగ్లాలో ఏర్పాటైన మినీతారు ప్లాంటేష‌న్‌ను అక్క‌డ నుంచి త‌ర‌లించేందుకు ఆర్ అండ్ బీ అధికారులు ఎట్ట‌కేల‌కు అంగీక‌రించారు. తారు ప్లాంట్ నుంచి వెలువ‌డే హానిక‌ర కాలుష్యం కార‌ణంగా స్థ‌నికులు ప‌డుతున్న ఇక్క‌ట్ల‌పై వీ డ్రీమ్్స తారు…మార‌ని అధికారులు తీరు పేరిట స‌మ‌గ్ర క‌థ‌నాన్ని వెలువ‌రించిన విష‌యం తెలిసిందే. దీనిపై స్పందిచిన వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం నాయ‌కులు అధికారుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపి ప్ర‌జ‌ల ఆరోగ్యం దృష్ట్యా ప్లాంట్‌ను అక్క‌డ నుంచి త‌ర‌లించాల‌ని కోరారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి దంతులూరి దిలీప్‌కుమార్ ఆర్ అండ్ బీ అధికారుల‌తో చ‌ర్చించి తారు ప్లాంట్ ఏర్పాటుకు ప్ర‌త్యామ్నాయ స్థ‌లాన్ని సూచించారు. దీంతో ప్లాంట్ అక్క‌డ నుంచి త‌ర‌లించేందుకు మార్గం సుల‌భ‌మైంది. తారు కాలుష్యం బెడ‌ద ప‌రిష్కారానికి కృషి చేసిన దిలీప్‌కుమార్‌, ఎమ్మెల్సీ బుద్ద నాగ‌జ‌గ‌దీశ్వ‌ర‌రావుకు స్థానికులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.‌

(Visited 23 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.