ఉక్కు ఉద్య‌మానికి టీడీపీ ముందుంటుంది

ఎమ్మెల్సీ బుద్ధ నాగ‌జ‌గ‌దీశ్‌

అన‌కాప‌ల్లి : కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ద్వారా యాజమాన్య హక్కుల తో పాటు రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (ఆర్ ఐఎన్ఎల్ )లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 100% షేర్ హొల్డింగ్ ను ఉపసంహరించుకోవడానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ జనవరి 27వ తేదీన ఆమోద ముద్ర వేసిందని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వర రావు విమర్శించారు . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ఏకోన్ముఖంగా పోరాడి 70 మంది ప్రజా ప్రతినిధులు రాజీనామా చేశారని 32 మంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. కేంద్రం మెడలు వంచి సాధించుకున్న పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇద‌న్నారు. ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక ఆంధ్ర గుండెకాయ లాంటి ఈ పరిశ్రమను నేడు మోడీ సర్కార్ బహుళజాతి కంపెనీలకు దారాదత్తం చేయడానికి పూనుకున్నారని నాగ జగదీష్ తెలిపారు. 1971లో శంకుస్థాపన చేసుకున్న ఈ నవరత్న సంస్థలలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 100% వాటాలున్నాయ‌ని, సముద్రతీరంలో ఏర్పాటైన తొలి సమీకృత ఉక్కుకర్మాగారం ఇదేనని చెప్పారు. ఒకప్పుడు భారీ నష్టాలను కూరుకుపోయిన సంస్థ తర్వాత కాలంలో 21,851 కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి చేరిందని నాలుగు సంవత్సరాల్లో 203.6% వృద్ధి సాధించి 2010లో నవంబర్ 17 దీనికి నవరత్న హోదా కల్పించారన్నారు. దేశంలో అతిపెద్ద సింగిల్ సైట్ ప్లాంట్ విశాఖ ఉక్కు కర్మాగారం ప్లాంట్ నిర్మాణానికి 4750 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన విశాఖ ఉక్కు 40 వేల కోట్ల వరకు వివిధ పన్నుల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తుందన్నారు. ఇప్పుడు దీని విలువ నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని నాగ జగదీష్ తెలిపారు. ఉక్కు కర్మాగారం లో 30 వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారని మరో 20 వేల మంది వరకు ఆధారపడి పనులు చేస్తున్నారని వీరందరికీ అన్యాయం జరిగే పరిస్థితి ఉన్నప్పటికీ వైసిపి ఎంపీలు ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విజయ్ సాయి రెడ్డి మాట్లాడకపోవడం వెనక కేసుల మాఫీ కోసమేన‌ని అర్థ‌మ‌వుతోంద‌న్నారు.

కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ పడి ఈ ప్రాంతానికి అన్యాయం చేయడానికి కంకణం కట్టుకున్నట్టు గా ఉందని జగదీష్ విమర్శించారు ఉత్తరాంధ్ర ఉన్న అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చేసి ప్రైవేటీకరణ జరగకుండా సమన్వయంతో ముందకు వెళ్లవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి ఉద్యమం చేయడానికి తెలుగుదేశం పార్టీ ముందుంటుందని స్ప‌ష్టం చేశారు. స్థానిక పంచాయతీ ఎన్నికలు ఆయన తర్వాత సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందిస్తామని నాగ జగదీష్ తెలిపారు. శాసన మండలి సభ్యులు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ కొణతాల వెంకటరావు కుప్పిలి జగన్ డి వి వి అప్పారావు కాండ్రేగుల రాజు మల్ల గణేష్ దొడ్డి జగదీశ్వర రావు కొణతాల తులసి మారిశెట్టి శంకర్రావు పిన్నింటి కనకారావు బత్తుల శ్రీను మొదలగు వారు పాల్గొన్నారు.

(Visited 13 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *