ఉపాధ్యాయుడిపై దాడి చేయడం అమానుషం. రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బుజ్జి బాబు.

చింతపల్లి:

మండలంలోని లోతుగెడ్డ గ్రామంలో గిరిజన బాలుర పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రదానోపాద్యాయులు కిముడు రాజం నాయుడు పై గిరిజనేతరులు భౌతిక దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్న విషయాన్ని తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు గురువారం ఉపాధ్యాయుడిని పరామర్శించారు. భౌతిక దాడికి కారణాలు ఏంటో తెలుసుకొని అధైర్యపడొద్దని, జరిగిన సంఘటన దారుణమంటూ ఖండించి దీనికి కారకులైన వారిని తగిన శిక్ష పడేలా కృషి చేస్తానని ఆయన భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో వైయస్ ఆర్ రాష్ట్ర కార్యదర్శి మత్యరాస విశ్వేశ్వరరాజు,  ఎంపీపీ వంతల బాబురావు, మండల సర్పంచులు, ఎంపీటీసీలు మరియు స్థానిక పాఠశాల సిబ్బందితో పాటు జీకేవీధి, పాడేరు, కొయ్యురు మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

(Visited 224 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *