మమతను పంచేది మాతృభాష

నంది పురస్కార గ్రహీత దాసరి తిరుపతినాయుడు
మమతను పంచేది మాతృభాష అని నంది అవార్డు గ్రహీత దాసరి తిరుపతినాయుడు అన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తోటపాలెం గాయత్రీ విద్యాసంస్థల యందు ఉత్తరాంధ్రస్థాయిలో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొని మాతృభాష గొప్పతనాన్ని తెలియచేస్తూ హృద్యమైన పద్యాలను ఆలపించారు. ఈ సందర్భంగా ధవళ సర్వేశ్వరరావు, కాగుపాటి నారాయణమూర్తి, బొత్స హరిప్రసాద్‌, కరణం శంకరరావు, గొట్టాపు శ్రీనివాసరావు, బాబూరావులు తమ పద్యాలతో అలరించిన అనంతరం ఆ ఏడుగురికి తెలుగు పద్యసాహిత్యంలో కృషిచేసిందులకు గాను తెలుగుభాషా పరిరక్షణ సమితి అధ్యక్ష కార్యదర్శులు సముద్రాల గురుప్రసాద్‌, డాక్టర్‌ జక్కురామకృష్ణలు కలిసి పురస్కారాలను అందచేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షురాలు ఎం సుభద్రాదేవి, దేవరశెట్టి శ్రీరామమూర్తి, కళాశాల ప్రిన్సిపాల్‌ ఆర్‌ వి నరసింహారావు, డోకి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

(Visited 157 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *