న్యాయ‌వాదుల ర‌క్ష‌ణ చ‌ట్టం అమ‌లు చేయాలి

కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన – విశ్వ ఐక్య పరిషత్ జాతీయ అధ్యక్షుడు ,

న్యాయవాది కానుపూడి ప్రియతమ్

ఇటీవల న్యాయవాదులైన వామన రావు , నాగమణి దంపతుల పై జరిగిన దారుణ హత్య భాదాకరమైన సంఘటన అని , అదేవిధంగా గతంలో న్యాయమూర్తులు , న్యాయ వాదుల పై దాడులు జరిగిన తర్వాత కూడా ఎటువంటి కఠిన చర్యలు , కఠిన చట్టాలను ప్రవేశ పెట్టక పోవడం వల్లనే ఇటువంటి దుశ్చర్యలు పునరావృతానికి కారణమని న్యాయవాది , విశ్వ ఐక్య పరిషత్ జాతీయ అధ్యక్షులు కానుపూడి ప్రియతమ్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.న్యాయవాదుల పై జరుగుతున్న ఈ దాడులు సభ్య సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదని , ఇది ఖచ్ఛితంగా న్యాయ వ్యవస్థ పై జరుగుతున్న దాడులని కానుపూడి ప్రియతమ్ ఎద్దేవా చేశారు . ఇలాంటి చర్యలు వల్ల న్యాయ వ్యవస్థకే రక్షణ లేకుండా పోతుందని , ఇలాంటి దుశ్చర్యలు భవిష్యత్ లో జరిగే అవకాశమే లేకుండా న్యాయ వ్యవస్థ పటిష్టతకై , న్యాయ వాదుల రక్షణకై కేంద్ర ప్రభుత్వం వెంటనే
” న్యాయవాదుల రక్షణ చట్టాన్ని” అమలులోనికి తీసుకురావాలని మరియు న్యాయవాదుల పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కానుపూడి ప్రియతమ్ డిమాండ్ చేశారు .

(Visited 73 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *