కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు హర్షణీయం
చింతపల్లి : జిల్లా కేంద్రంలోని షీలా నగర్ లో ప్రగతి భారతి ఫౌండేషన్ 300 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం హర్షణీయమని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ రెండవ దశలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తుందన్నారు. ప్రభుత్వ,ప్రైవేటు వైద్యశాలల్లో బెడ్స్ దొరకని పరిస్థితి దాపురించింది అన్నారు. ఈ పరిస్థితిపై పార్లమెంటు సభ్యుడు విజయ్ సాయిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రాణవాయువు తో కూడిన 300 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్ బాధితులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
(Visited 219 times, 1 visits today)