అంబేద్క‌ర్ ఆత్మ ఘోషిస్తోంది

జ‌గ‌న్ తీరు అవ‌మాన‌క‌రం
ఎమ్మెల్సీ నాగ జ‌గ‌దీశ్వ‌ర‌రావు


అన‌కాప‌ల్లి : జగన్ రెడ్డి తీరుతో అంబేద్కర్ ఆత్మఘోషిస్తుందని శాసనమండలి సభ్యులు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు విమర్శించారు. రాష్ట్రంలో రాజ్యాంగం సంక్షోభంలో పడి 18 నెలలు రాజ్యాంగాన్ని అడుగడుగునా అవమానిస్తున్న జగన్ రెడ్డి తీరుతో అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది. నియంత పాలనకు పెద్ద కొడుకుగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలులోకి తెచ్చి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు. అంబేద్కర్ పై ఏ మాత్రం అభిమానం ఉన్నా అమరావతిలోని స్మృతి వనం పనులు కొనసాగించాలి.
18 నెలలుగా రాష్ట్రంలో రాజ్యాంగంను సంక్షోభంలోకి నెట్టారని జగదీష్ తెలిపారు ఉద్యోగులకు వేధింపులు, న్యాయ స్థానాలపై కుల ముద్రలు వేసి దేశంలో ఎన్నడూ లేనంతగా రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు. ఏ వర్గ పజల్ని జగన్ రెడ్డి సంతోషంగా ఉండనిస్తున్నారు.? జగన్ రెడ్డి అనే భయంకరమైన గద్ధను చూసి ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అహంకారం, అక్కసు, కుట్రలు జగన్ చుట్టూ వైఫైలా ఉన్నాయి. స్వతంత్ర వ్యవస్థ అయిన ఎన్నికల సంఘంపై కక్ష గట్టారు.
సామాన్యుడి నుండి ఉన్నస్థాయి వ్యక్తుల వరకు జగన్ రెడ్డి అహంకారాని గురవుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై అక్రమ కేసులు పెట్టి ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు. నిరంకుశత్వానికి అధినాయకుడిగా జగన్ రెడ్డి ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం ఏ ఒక్క రోజైనా జగన్ రెడ్డి నడుచుకున్నారేమో ఆత్మ విమర్శ చేసుకోవాలి. సామాజిక న్యాయ సాధన రాజ్యాంగ ప్రథమ లక్ష్యం అని బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన మని హక్కులు అవకాశాలు ప్రభుత్వ పథకాలు లాంటివి ప్రజలు అనుభవంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వంతో పాటు అందరూ చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడే రాజ్యాంగం ఆశించిన సామాజిక న్యాయం ప్రజలకు దక్కుతుందని నాగ జగదీష్ తెలిపారు

(Visited 17 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *