బైకులు ద‌హనం చేసిన దుండగులు

విశాఖపట్నం : కొందరు గుర్తు తెలియాని వ్యక్తులు ద్విచక్ర వాహనాలు దగ్ధం చేసిన ఘటన విశాఖ అల్లిపురంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఆదివారం వేకువజామున కొందరూ గుర్తుతెలియని వ్యక్తులు అల్లిపురం కరణాల వీధి, గవరవీధి తదితర ప్రాంతాల్లోకి ప్రవేశించి ద్విచక్ర వాహనాల సీట్లను దగ్ధం చేశారు. ఈ ఘటనలో సుమారుగా 03 ద్విచక్ర వాహనాలను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్, గంజాయి కార్యకలాపాలకు పాల్పడినవారు ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారని పోలీసులు భావిస్తున్నారు. వీరిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని టూ టౌన్ ఎస్ఐ లు నర్సింగరాజు, సల్మాన్ బేగ్ లు పిలుపునిచ్చారు. నేరాలను నియంత్రించడంలో సీసీ కెమెరాలు చాలా కీలకంగా నిలువడమే కాక, నేర నిరూపణలోనూ ప్రధాన భూమికను పోషిస్తున్నాయన్నారు. ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు.

(Visited 138 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *