అభ‌ద్ర‌త – భ‌ద్ర‌త ఈ రెండూ విరుద్ధాలు

అభ‌ద్ర‌త – భ‌ద్ర‌త ఈ రెండూ విరుద్ధాలు
కాంతి – నిష్కామ కాంతి ఈ రెండూ విరుద్ధాలు
జీవితం – స‌మాధి ఈ రెండూ నైరాశ్యాలు – మెథ‌డ్
కొత్త ఏడాది కొత్త వ్యాక్సిన్
ప‌రస్ప‌ర స్నేహితాలు
కొత్త వ్యాక్సిన్ పాత జ‌బ్బు
ప‌రస్ప‌ర ఆధారితాలు
జ‌బ్బులు ఏమ‌యినా కార‌కాలు ఏమ‌యినా
లోకం అన్నింటినీ భ‌రించ‌డం బాధ్య‌త
బాధ్య‌త ప్ర‌యోగ పూర్వం కూడా ఓ బాధ్య‌త
ఈ బాధ్య‌త భార‌త్ బ‌యోటెక్ ది కావొచ్చు
లేదా సీరం ఇనిస్టిట్యూట్ ది కావొచ్చు – మోటివ్

మార్నింగ్ రాగా : వ్యాక్సిన్ వాక్
కొత్త వైర‌స్ వ‌స్తే కొత్త వ్యాక్సిన్ వ‌స్తుంది..వ్యాధికి మందు వ‌స్తే నివార‌ణ సాధ్యం అవు తుంది..నియంత్ర‌ణ అన్న‌ది సాకారం అవు తుంది..ప్ర‌తి వ్యాక్సిన్ మూడు అంచెలు దాటుకుని రావాలి అని నిన్న చ‌దివేను ఒక‌టి భ‌ద్ర‌త రెండు స‌మ‌ర్థ‌త మూడు స‌మ ‌గ్ర‌త.. ఈ మూడు ప్ర‌తి వ్యాక్సిన్ కూ త‌ప్ప‌నిసరి..భార‌త్ బ‌యోటెక్ ఆ ప‌నిలో ఉంది. కా నీ ఈ లోగానే దేశంలో మ‌రికొన్ని ఉన్మాదాలు వై ర‌స్ ల రూపంలో ప్ర‌యాణిస్తున్నా యి..అవి అవ‌కాశం నుంచి అవ‌కాశం వ‌ర‌కూ ఉంటాయి.. అవ‌కాశం నుంచి అదృష్టం వ‌ర‌కూ ఉం టాయి..శ‌క్తి ఎంచి,యుక్తి ఎంచి ఏదో ఒక‌టి చేసి పోతాయి. మ‌న ద‌గ్గ‌ర వి జ్ఞానం ఉన్నా లేకున్నా ఒక్క‌టే ..మ‌న ద‌గ్గ‌ర సైన్సు రాణిం చ‌దు..మ‌తం రాణిస్తుంది ..హుండీలో డ‌బ్బులు ఏమ‌యినా మంచి ప‌నులు చేస్తాయా అంటే అదీ ఉండ‌దు.. ఏ మీ ఉండదు .. మ ‌నం రాజ‌కీయంలో మ‌నం మ‌తంలో మ‌త్తులో ఉంటూ కొత్త వైర‌స్ కారకాల‌ను గుర్తించండి అంటూ సైంటిస్టుల‌ను ప‌రుగులు తీయిం చ‌డం అన్న‌దే త‌గ‌ని ప‌ని అని తోస్తోంది. అయినా మ‌న జీవ‌న విధానం మార‌దు.. ఆలోచ‌న మార‌దు.. మ తం ధార్మికం..సైన్సు ఏ మీ కాదు.. ధార్మికం ఈ దేశానికి చాలా అవ‌సరం కాద‌న్నానా అన‌ను.. సైన్సు ఇంకా అవ‌స‌రం..ధార్మికం సాంత్వ‌న అయితే వైజ్ఞాని కం ప‌రిష్కారం.. జీవ‌న్మ‌ర‌ణాల‌కు ప‌రిష్కారం .. మ‌ర‌ణానికి అంతిమ రేఖ‌లు కూడా చెరిపేయ‌డం వై జ్ఞానికంతో సాధ్యం..ధార్మికం ఆ ప‌ని చేస్తుంద‌ని నేను అనుకోను.. నిర్థారించ‌లేను కూ డా! కానీ రాజకీయం ధార్మికం నుంచి ఏదో ఒక‌టి పిండుకుంటుంది.. అ లాంటి చోటు యోగీ మ‌రియూ మోడీ ఉంటారు… ఉండాలి కూడా! ఇంకా విప‌క్షం ఉంటే ఉంటుంది. ఇప్పుడు స‌మ‌స్య ప‌రిష్కారం కూడా ఓ రాజ‌కీయ అవ‌స‌రం అయితే కావొచ్చు.. అం దుకే వీటిపై మీ మీ డిక్ల‌రేష‌న్లు ఇస్తూ పొండి.. మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రా జును రామ తీర్థం ట్ర‌స్ట్ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తే స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుందా అది కూడా ఆలోచించాలి ప్ర‌స్తుత ప్ర‌భుత్వం.. మ‌నం కార‌ణాలు వెతికి మూలాలు ఏమ‌యి నా ఉంటే స‌మ‌స్య‌కు సంబంధించి వాటినీ అన్వేషించి త‌రువాత మాట్లాడాలి.. కానీ అ లా మాట్లాడం..మ‌న‌కు రంగుల అద్ద‌కం అల‌వాటు..అద్ద‌డం కూడా..అద్ద‌కం చ‌ర్య పూ య‌డం..ప్ర‌తి చ‌ర్య ..పుల‌మ‌డం చ‌ర్య..ఏదో ఒక రంగును వ‌దిలించుకోలేక‌పోవ‌డం అచే త‌న…అయినా కావొచ్చు..చ‌దివేను ఓ చోట‌..
వ‌స్తున్నాడ‌య్యా ఆ యోగీ
ఆగ‌యా ఆగ‌యా..
ఉత్త‌ర భారతం నుంచి యోగి వ‌స్తున్నాడు దారి ఇవ్వండి ఏం కాదు. ఇప్పుడు రామ తీర్థం ఈ దేశం స‌మ‌స్య.. కావాల‌ని త‌ల‌పోస్తూ వ‌స్తున్నాడు.. పాపం పిల్లాడు ఆ జ‌గ‌న్ ను అర్థం చేసుకోడే.. కొంద‌రు మ‌నుషులు ఆయ‌న‌ను ఇలా బ‌ద‌నాం చేస్తున్నార‌ని.. అయినా ఈ స‌మ‌స్య యోగీ మ‌రియు మోడీ తీర్చ‌గ‌ల‌రు.. వారే స‌మ‌ర్థులు ..దేశంలో ఆల‌యా లూ,ఆక‌ళ్లూ అన్నీ ఆ క‌ళ్లే నిర్ద‌య అన్న‌ది లే కుండా చూస్తున్నాయి..ఇంత వికాసం, విజ్ఞానం మ‌నుషుల‌కు ఇవ్వండ్రా ఎవ‌డికి కావాలి ఈ మ‌తాల గోల అంటే విన‌రేం.. రా ముడు నా రాముడు.. వాడి క‌ష్టం నా ఇంటి క‌ష్టం ఒప్పుకుంటాను..వాడి విష‌య‌మై స్పందిస్తాను కానీ రాజ‌కీయం త‌గునా అంటే ఒ ప్పుకోను..ఈ దేశాన మాట్లాడితే చా లు మ‌న‌కు రాముడు గుర్తుకువ‌స్తాడు.. మాట్లాడకున్నా కూడా రాముడే గుర్తుకువ ‌స్తాడు. అ లా రావ‌డం బీజేపీ బీజియంలో భాగం.. సో.. మోడీనీ యోగీనీ ఏమీ అనొ ద్దు..వారంతా మంచోరు. కాషాయం లోనే ధ‌ర్మం ఉంది.. శ్వేత వ‌ర్ణంలో ధ‌ర్మం లేదు.. ఆకుప‌చ్చ జెండాలో ధ‌ర్మం లేదు..అన్న‌ది వారి నిర్థిష్ట భావ‌న‌..క‌నుక వైర‌స్ క‌న్నా మ ‌త‌మే అత్యంత బాధాక‌ర‌మ‌యిన స్థితిలో దేశాన్ని ఉంచుతుంది. మ‌రి! కో వ్యాగ్జిన్ ప‌నిచేసినా, చేయ‌కున్నా ఇలాంటి ఉన్మాదా నికి అవ‌కాశవాదా నికి ఎటువంటి విరుగు డూ లేదు. ఉండ‌దు కూడా!
గుర్తుంచుకోవ‌డం ఏంటి
గుర్తుకు రావ‌డం ఏంటి
తొలి త‌రం వ్యాక్సిన్ల రూప‌క‌ర్త‌ల్లో ఒక‌రు లూయీ పాశ్చ‌ర్ గుర్తుకువ‌స్తాడు..లేదా ఆ త ‌రానికి కొనసాగింపుగా జ‌రిగిన ప్ర‌యోగాలే గు ర్తుకువ‌స్తాయి..క‌రోనా పై దేశం మొత్తం పోరాడ‌డం లేదు.. అది అబ‌ద్దం ముందు ఆ మాట మార్చ‌మ‌నండి ఆ పిల్ల‌ను వి న‌లేక ఛ‌స్తు న్నా.. మ‌తం,గ‌తం మార‌ణ‌హోమం వీటిపైనా దేశం త‌గు విధంగా స్పందిం చ‌డం లేదు..అలాంట‌ప్పుడు స్వీయ ర‌క్ష‌ణే శ్రీ‌రామ ర‌క్ష అని చెబుతున్నారా అదే నిజం..అం త‌కుమించి నిజాల‌ను భార‌త్ బయోటెక్ విడుద‌ల చేయ‌దు.. అంగీక‌రించ‌దు.. తెల్ల గ డ్డం బాగా పెంచుతున్న మోడీ కూడా ఒప్పుకోడు. పిల్లాడు ఇంకా పాఠాలు నేరుస్తు న్నాడు అని అంటారా ఆ జ‌గ‌న్ ను ఆయ‌న కూడా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది.. వ్యాక్సిన్ ను కాదు జ‌నానికి ఇంగితాన్ని ఉచితంగా పంచండి బాగుంటుంది. మూడు కోట్ల మందికి ఉచితంగా ఇంగితాన్ని మీరు పంచండి అది విస్తృతం అయితే చూద్దాం.. ఎందుకంటే మీరు ఇద్దాం అనుకుంటున్న ఫ్రీ వ్యాక్సిన్ ఆ 3 కోట్ల మందికే క‌దా! నాలు గు ప‌డ‌గ‌ల హైంద‌వ నాగ‌రాజు ఏమ‌యినా చెప్పాడా.. లేదా ఇనుప గ‌జ్జెల తల్లి ఏ మ‌ యినా నేర్పిందా? ఏం లేదు..దేశంలో మ‌హిళ‌ల‌కూ చిన్నారుల‌కూ లేని భ‌ద్ర‌త ఆల‌ యంలో రాముడికీ,కృష్ణుడికీ వ‌స్తుంద‌ని ఆల‌యం బ‌య‌ట ఉన్న రథా నికి వ‌స్తుంద‌ని అనుకోను. అయినా ఈ దేశాన బాధ్య‌త లేని పౌరులున్న రీతిలోనే ప్ర‌భుత్వాలూ ఉ న్నాయి..అర్జెంటుగా టాపిక్ డైవ‌ర్ట్ చేయండి.. కోవెల‌ల‌లూ.. ఆల‌యాలూ.. మందిరా లూ అన్నీ మ‌న సంస్కృతి సంప‌ద‌లు అన్న ఇంగితంలో లేని ప్ర‌జ‌లు..ఉన్నంత కా లం కొన్ని వైర‌స్ లు ఉంటేనే మేలు..కొన్ని వ్యాక్సిన్లు రాకుంటేనే మేలు.
ఇంకా ఇంకొన్ని
వైర‌స్సులూ ఉన్నాయి జాగ్ర‌త్త
మోడీ నుంచి జ‌గ‌న్ వ‌ర‌కూ వెయిట్ అండ్ సీ..అన్న ధోర‌ణిలో ఉన్నారు.. రాముడు ఓ వైపు క‌రోనా అనే రావ‌ణుడు ఓ వైపు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని క‌దిపి కుదిపేస్తున్న త‌రుణా న కొత్త వార్త.. శుభ వార్త.. కో వ్యాగ్జిన్ ను అనుమ‌తి. రాముడు ఏమ‌యినా ఈ వైరస్ ను నిర్మూలించ‌గ‌ల‌డా..మ‌ళ్లీ శాస్త్రం ప్ర‌యోగం విద్య విధానం అన్నీ కూడిన‌వి కావాలి కూడుకుని రావాలి.. పోనీ బీజేపీ రాముడు,జగ న్ రాముడు,చంద్ర‌బాబు రాముడు అంటూ ఇంత మంది రాముళ్లు ఉన్నా కూడా ఏం చేస్తున్నార‌ని.. హా హా ఏం లేదు మ‌న రాజ కీయం ఎంత నిఛాతి నీఛంగా ఉందో చెప్ప‌క‌నే చెబుతున్నారు. విని త‌రిం చ‌డం మ‌న బాధ్యత నైరాశ్యంలోనూ రామ నామ స్మ‌ర‌ణ చేయ‌డమే బాధ్య‌త… రా ముడు ఎక్క‌డున్నాడు..రాముడు నైరాశ్యంలో ఉన్నాడు రాముడు అడ‌విలో ఉన్నాడు రాముడు కుత్తుక లు తెగిన చోట శాంతి మంత్ర ఉప‌దేశంలో ఉన్నాడు.. మ‌రి! రాము డు గెలిచాడా..గెల‌వ‌డు..మ‌నం గెలిపించాలి.. కానీ మ‌నం ఆ ప‌ని చేయం.. ఆ ప‌ని కాదు ఏ ప‌నీ చేయం.. మ‌నం భాగ్య న‌గ‌రిలో రాముడ్ని విజ‌య‌న‌గ‌రిలో రాముడ్ని వేరువే రుగా చూస్తాం.. మ‌న‌లో ఈ వైర‌స్ పోదు ఈ టీకా దీనికి ఉప‌శ‌మ‌నం కాదు.

(Visited 29 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *