సాఫ్ట్‌స్కిల్స్‌ పాఠ్యాంశంగా బోధించాలి

వీసీ ఆచార్య పి.వి.జ.డి ప్రసాద రెడ్డి

విశాఖపట్నం: విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్‌ను పాఠ్యాంశంగా బోధించాల్సిన అవసరం ఉందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం ఏయూ అకడమిక్‌ సెనేట్‌ మందిరంలో రైటర్స్‌ అకాడమి నిర్వహించిన కార్యక్రమంలో ‘కంప్లీట్‌ బుక్‌ ఆన్‌ సాఫ్ట్‌స్మిల్స్‌’ను ఆవిష్కరించారు. ఏయూ జర్నలిజం విభాగ విశ్రాంత ఆచార్యులు పి.బాబి వర్ధన్‌, ఏయూ సాఫ్ట్‌స్కిల్స్‌ శిక్షకుడు డాక్టర్‌ చల్లా క్రిష్టవీర్‌ అభిషేక్‌ిలు సంయుక్తంగా రచించిన ఈ పుస్తకాన్నివీసీ ప్రసాద రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పుస్తక రచనానైపుణ్యాలను, సామార్థాలను విద్యార్థులకు అలవరచాల్సిన అవసరం ఉందన్నారు. విశ్రాంత ఆచార్యులు నేటి తరం యువతతో సంయుక్తంగా పుస్తక రచన చేయాలని సూచించారు.

గతంలో ఉమ్మడి కుటుంబాలు సాఫ్ట్‌స్కిల్స్‌గా నేకు చెబుతున్న విభిన్న జీవన నైపుణ్యాలను అందించేవన్నారు. నేటి తరం దీనిని ఒక పాఠ్యాంశంగా నేర్చుకోవలసిన అవసరం ఏర్పడుతోందన్నారు. దీనిని భర్తీ చేసే దిశగా ఈ పుస్తకం రావడం మంచి పరిణామమన్నారు.
దీనిని చిన్న భాగాలుగా తీర్చిదిద్ది, డిజిటల్‌ రూపంలో తీర్చిదిద్దాలన్నారు.

వర్సిటీ రిజిస్టార్‌ ఆచార్య వి. క్రిష్టయైహన్‌ మాట్లాడుతూ ఉపాధి కల్చనలో ఇవి ఎంతో కీలకంగా
నిలుస్తాయన్నారు. విద్యార్థుల్లో బిడియం, భయం రూపుమాపి, వారిలో అవసరమైన సామర్థ్యాలను ‘పెంపొందిచడానికి సాఫ్ట్‌స్కిల్స్‌ శిక్షణ ఉపకరిస్తుందన్నారు. పుస్తక రచయితలను అభినందించారు.

పుస్తక రచయిత ఆచార్య పి.బాబి వర్ధన్‌ మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలు పరిష్కారానికి, భావ నైపుణ్యాలు మెరుగు పరచడానికి, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఉపయుక్తంగా ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దామన్నారు. రైటర్స్‌ అకాడమి అద్యక్షులు వి.వి రమణ మూర్తి మాట్లాడుతూ తమ సంస్థ నుంచి గతంలో పలు పుస్తకాలను ఆవిష్కరణ చేయడం జరిగిందన్నారు. చారిత్రక ఏయూ సెనేట్‌ మందిరంలో ఈ పుస్తకం ఆవిష్కరణ చేయడం మంచి పరిణామమన్నారు. కార్యక్రమంలో పుస్తక రచయిత చల్లా క్రిష్ణవీర్‌ అభిషేక్‌, పాలక మండలి సభ్యులు వర్మ తదితరులు పాల్గొన్నారు.

(Visited 23 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *