రేపు మన్యం బంద్

చింతపల్లి:

విశాఖ ఏజన్సీ లోతుగడ్డ గిరిజన సంక్షేమ శాఖ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కీముడు రాజాం నాయుడు పై దుండగుల దాడికి నిరసనగా నేడు 25 న విశాఖ ఏజెన్సీలో విద్యా సంస్థల బంద్ – క్విట్ నాన్ ట్రైబల్స్ నినాదంతో 26 న మన్యం బంద్ కు పిలుపునిచ్చిన ఆదివాసీ హక్కుల పరిరక్షణ సమితి జేఏసీ దాడికి పాల్పడిన గిరిజనేతరుల పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ & ఐపీసీ 307 హత్యహత్నా నేరం కింద జిల్లా కన్వీనర్ ఆదివాసీ హక్కుల పరిరక్షణ సమితి జేఏసీ కేసు నమోదు చేయాలి దొర డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల గిరిజనులు పండించిన పంట, గిరిజనుల భూముల్లో నివాసముంటూ గిరిజనుల ప్రతిఫలాలను అనుభవిస్తూ గిరిజనుల పై దాడి చేయడం ఏమిటని పలువురు గిరిజన మేధావులు ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన ఇరువురు తో పాటు వాళ్లకు ప్రోత్సహించిన వ్యక్తులపై ఎస్సీటీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్లను కోర్టులో హాజరు పర్చాలని ఆయన డిమాండ్ చేశారు. వాళ్లపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అధికారుల బాధ్యత రహితంగా నిర్వహించాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

(Visited 115 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *