చ‌ట్ట‌స‌భ‌ల‌కు ఊర్మిళ‌

ఊర్మిళ‌..ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని సెలబ్రెటీ. రంగీలాతో జ‌నం గుండెల్లో ఇప్ప‌టికీ నిలిచిపోయిన సూప‌ర్ బ్యూటీ. సినిమాల‌కు గుడ్‌బై చెప్పి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసింది. తాజాగా చ‌ట్ట‌స‌భ‌ల్లోకి అడుగుపెట్ట‌బోతోంది. మ‌హారాష్ట్ర శాస‌న‌మండిలికి జ‌ర‌గ‌నున్న ఎన్న‌కల్లో అధికార శివ‌సేన పార్టీ నుంచి అందాల తార ఊర్మిళ‌ను నామినేట్ చేయ‌డం దాదాపు ఖ‌రారైంది. అభ్య‌ర్థుల ఎంపిక‌పై శుక్ర‌వారం పార్టీ నేత‌లు చ‌ర్చించి ఊర్మిళ పేరును ఖ‌రారు చేశారు. ఇదే విష‌యంపై శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ కూడా స్పందించారు. ఊర్మిళ‌ను శాస‌న‌మండ‌లికి నామినేట్ చేస్తున్న విష‌యం వాస్త‌వ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. అయితే మ‌రోసారి చ‌ర్చించిన అనంత‌రం జాబితాను సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేకు అంద‌జేస్తామ‌ని, తుది నిర్ణ‌యం ఆయ‌న తీసుకుంటార‌న్నారు.

(Visited 6 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.