వీ డ్రీమ్స్ క్యాలెండర్ ని ఆవిష్కరిస్తున్న ప్రముఖ వాణిజ్య వేత్త ఎంవిఆర్
అనకాపల్లి :
ప్రారంబించిన అనతికాలంలోనే “వీ డ్రీమ్స్” మంచి పేరు తెచ్చుకుందని పాత్రికేయ విలువలకు కట్టుబడి పనిచేస్తున్నదని ప్రముఖ వాణిజ్య వేత్త ఎంవిఆర్ అన్నారు. ఆదివారం అనకాపల్లిలో 2023 “వీ డ్రీమ్స్” క్యాలెండర్ ను ఆయన విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ జర్నలిస్టు ల ఆధ్వర్యంలో “వీ డ్రీమ్స్” వెబ్ న్యూస్ పేపర్ల రంగంలో ఎన్నో విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో సోషల్ మీడియా సమాజంలో కీలక పాత్ర పోషించనుందని ఆయన అన్నారు. “వీ డ్రీమ్స్” ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వి రామచంద్రరావు మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలవాలన్న ఆశయంతో ప్రారంభమైన “వీ డ్రీమ్స్” ను మరింత అభివృద్ధి చేస్తామని
. వెబ్ న్యూస్ పేపర్లకు ఆదరణ పెరుగుతుందని అన్నారు. ఇటీవల “వీ డ్రీమ్స్” ప్రచురించిన “నోషనల్ ఖాతాలకు మోక్షం “అనే వార్తను రెండు రోజుల్లో ఇరవై వేల మంది చదవడం ఒక ఉదాహరణ అని అన్నారు. నోషనల్ ఖాతాలను రెగ్యులర్ ఖాతాలుగా మార్చమని రెవెన్యూ శాఖకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయని అన్నారు. పెద్ద దినపత్రిక లతో వెబ్ న్యూస్ పేపర్లు పోటీకి నిలిచి విజయం సాధించడం ఒక విశేషమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు అవ్వ,నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.