26న జ‌రిగే వంటావార్పును విజ‌య‌వంతం చేయండి


విశాఖ ఉక్కు ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని కోరుతూ ఈ నెల 26న తలపెట్టిన వంటావార్పు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ గాజువాక సిఐటియు కార్యాలయంలో విశాఖ ఉక్కు పోరాట సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ ఎంతోమంది త్యాగధనుల పోరాటం వల్ల వచ్చిన విశాఖ ఉక్కు ప్రైవేటు రంగాన్ని పరిమితం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నా కుటిల ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని దీనిలో భాగంగా ఈ నెల 26న ఐదు చోట్ల వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీనికి నిర్వాసిత నాయకులు రాజకీయ పార్టీలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తద్వారా కేంద్రానికి ఒక హెచ్చరిక చేయాలని నాయకులు అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పోరాట సమితి నాయకులు గంధం వెంకట్రావు, బొడ్డు పైడ్రాజు, వైటి దాస్, మస్తాన్ అప్ప, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

(Visited 31 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.