ప్రభుత్వ వెబ్ ల్యాండ్ కు… అవినీతి వైరస్……… రెవిన్యూలో…. ఇంటి దొంగలు వెబ్ ల్యాండ్ సవరణ పేరుతో కాసుల వేట భేరం కుదిరితే సరే, లేదంటే భూ యజమానికి చుక్కలే ఇదీ ఆనకాపల్లి జిల్లా రెవిన్యూ మాయ

అనకాపల్లి వీ డ్రీమ్స్

 

 

జిల్లాలో వెబ్ ల్యాండ్ లో రికార్డులను మార్చే మాయ గాళ్లు పెరిగి పోయారు. పచ్చ నోట్లు కళ్ళముందు ఆడిస్తే చాలు ఇంటి దొంగలు బరితెగించి అక్రమ మార్గాన్ని తొక్కేస్తున్నారు…రెవిన్యూ లో మర్రి ఊడల్లా విస్తరించిన ఇంటి దొంగల ఆగడాలతో రైతులు, భూ యజమానులు పడుతున్న ఇబ్బందులాంతా ఇంతా కాదు.ప్రభుత్వ భూములను జిరాయితి భూములుగా ఏ మార్చి ఈ మాయ గాళ్లు సొమ్ములు చేసుకుంటున్నారు. జిల్లాలో ఉన్న ప్రతి మండలంలోను వెబ్ ల్యాండ్ రికార్డులు అస్తవ్యస్తంగా ఉండటంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇటీవల కశింకోట తహసీల్దారు ఉగ్గినపాలెం రెవెన్యూ లో సర్వే నెంబరు 88 గెడ్డ పోరంబోకు భూమిని వెబ్ ల్యాండ్ లో అతుకుబడి భూమిగా 88/1 గా 2.50 ఎకరాల భూమిని చూపిస్తూ బలిజ ముసిలి నాయుడు పేర పట్టా దారు పాస్ బుక్ మంజూరు చేసారు. అయితే ఈ సర్వే నెంబరు సుజల స్రవంతి ల్యాండ్ ఎక్విజేషన్ లో పోతుంది. దీన్ని అసరాగా తీసుకుని ముసలి నాయుడు కశింకోట తహసీల్దారు తో బేరం కుదుర్చుకుని ప్రభుత్వ భూమిని అతుకుబడి భూమిగా రికార్డులను మార్చి వేసారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అప్పట్లో తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని అప్పట్లో “వీ డ్రీమ్స్” వెలుగులోకి‌ తీసుకు రావడంతో వెంటనే వెబ్ ల్యాండ్ లో బలిజ ముసిలి నాయుడు పేర నమోదు చేసిన‌ వన్ బి ని తొలగించారు. ఈ వ్యవహారం పై జిల్లా ఉన్నతాధికారులు ఎవరు కనీసం విచారణ చేపట్టలేదు. వెబ్ ల్యాండ్ లో రైతు పేర ఉన్న భూమిని తొలగించాలి అంటే అందుకు సంబందించి ఒక నివేదికను తయారు చేసి రెవెన్యూ డివిజన్ అధికారికి పంపాలి.అటుపై ఆర్డీఒ విచారణ జరిపి వెబ్ ల్యాండ్ లో ఎంట్రీని తొలగించడంతో పాటు జిల్లా అధికారులకు నివేదిక పంపవలసి ఉంటుంది. కాని ఈ వ్యవహారం పై ఎటువంటి విచారణ జరపలేదని స్దానికులు ఆరోపిస్తున్నారు.తక్షణమే విచారణ జరిపి సంబంధిత అధికారులపై పాలనాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా సుజల స్రవంతి లో భాగంగా ఉగ్గిన పాలెంలో రైతుల భూములను ఎక్విజేషన్ చేసేందుకు పత్రికలో పబ్లికేషన్ ఇచ్చారు. అయితే ఈ పబ్లికేసన్ లో వెబ్ ల్యాండ్ లో ఉన్న వివరాలు కాకుండా లే అవుట్ కోసం విక్రించిన బలిజ ముసిలి నాయుడు పేరు ఉండటం పట్ల రైతులు అభ్యంతరం తెలుపుతూ పిర్యాదు చేసినట్లు తెలిసింది.ఈ వ్యవహారం పై కూడా విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కశింకోట తహసీల్దారు బత్తుల సుధాకర్ పై వచ్చిన పలు అవినీతి ఆరోపణలు దృశ్య ప్రాధాన్యత లేని చోట పోస్టింగ్ ఇవ్వాలని జిల్లా అధికారులకు సిసిఎల్ఎ ఉత్తర్వులు జారీచేసింది. అయితే సిసిఎల్ఎ నుండి వచ్చిన ఆదేశాలను జిల్లా అధికారులు పట్టించుకోలేదు. తన పలుకుబడిని ఉపయోగించుకుని సుధాకర్ ఇక్కడే కొనసాగడం విశేషం.వెబ్ ల్యాండ్ లో రికార్డులను ఎంట్రి చేసె తహసీల్దారు టోకెన్ తహసీల్దారు అజమాయిషీ లోనే ఉంటుంది. దీంతో జిల్లాలో అనేక చోట్ల తమకు చెప్పు చేతిలో ఉండే కంప్యూటర్ ఆపరేటర్ ని ఏర్పాటు చేసుకుని తప్పుడు తతంగాలి నిర్వహిస్తారనే ఆరోపణలు వినిపిస్తు‌న్నాయి. తహసీల్దారు టోకెన్ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర ‌ఉండటంతొ వెబ్ ల్యాండ్ లో తప్పుడు వ్యవహారాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. దీంతో వెబ్ ల్యాండ్ లో ఇష్టం సారంగా రికార్డులను మార్చినా అడిగేవాడు లేడనే ధైర్యం తో మరింత రెచ్చి పోతున్నారు. అనకాపల్లిలో పేదలకు ఇచ్చిన డి ఫారం భూములను ల్యాండ్ ఫులింగ్ క్రింద తీసుకోవడం జరిగింది.అయితే ఈ ల్యాండ్ వివరాలను “వీ డ్రీమ్స్” మీ భూమి లో లో పరిశీలించగా జిరాయితి భూములు గా నమోదు కావడం గమనించదగ్గ విషయం. పేదలకు ప్రభుత్వం ఇచ్చే భూములు అమ్మకం, కొనుగోలు నిషేధం కాని అనకాపల్లి మండలంలో మీ భూమిలో మాత్రం పేదలకు ఇచ్చిన‌ అతుకుబడి భూమి క్రియం అని చూపించడం చూస్తే రెవెన్యూ అధికారులు ఏ స్థాయిలో ఉన్నారో అర్దం అనకాపల్లి మండలం లో సుమారు పది ఎకరాల వాగు పోరంబోకు భూమిని డి ఫారం భూములు ఇచ్చినట్లు గా మీ భూమిలో నమోదు చేసినట్లు రెవెన్యూ అధికారి అవినీతి భోగోతం తెలిసింది. త్వరలో ఈ బాగోతాన్ని “వీ డ్రీమ్స్” వెలుగులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది.

(Visited 1,511 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.