వాహనాలు పై ఉన్న పన్ను, అపరాధ రుసుము వసూలు జిల్లా రవాణా అధికారి ఎం వీర్రాజు
అనకాపల్లి :
అనకాపల్లి జిల్లా పరిధిలో వాహనాల పై ఉన్న పళ్ళు బకాయిలు అపరాధ రుసుములు వెంటనే చెల్లించాలని వాహనదారులకు జిల్లా రవాణా అధికారి ఎం వీర్రాజు విజ్ఞప్తి చేశారు. ఆయన తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వాహన పన్ను బకాయిలు, వాహనాలపై ఉన్న బకాయిల చెల్లింపు, వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు, రోడ్ సేఫ్టీ వంటి పలు అంశాలపై మాట్లాడారు.
అనకాపల్లి జిల్లాలో 6818 వాహనాలు ప్రభుత్వానికి పన్ను బకాయి ఉన్నట్టు రవాణా శాఖ అధికారులు గుర్తించారాన్నారు. ఈ పన్నుల రూపంలో ప్రభుత్వానికి సుమారు 12 కోట్ల రూపాయలు బకాయిలు వసూలు కావలసి ఉందన్నారు. ఈ వాహనాలపై చర్యలకు రవాణా శాఖ ఉపక్రమించిందినీ పన్ను బకాయి ఉన్న వాహన యజమానులకు ఫోన్ ద్వారా సంప్రదించడం, నోటీసులను పంపించడం, మెసేజ్ ల ద్వారా సమాచారం తెలియజేయడం జరుగుతుందన్నారు. మోటార్ వాహన ఇన్స్పెక్టర్ ల ద్వారా తనిఖీలు (స్పెషల్ డ్రైవ్స్) చేస్తున్నామని, జనవరి నెలలో 1123 కేసుల ద్వారా రూ. 91 లక్షల రూపాయలు బకాయిలు వసూలు చేశామని అలాగే కేసుల ద్వారా పన్ను చెల్లించాల్సి వస్తే 200 శాతము అపరాధ రుసుంతో చెల్లించాల్సి ఉంటుందని, వాహన పన్ను బకాయి ఉన్న వాహన యజమానులకు వెంటనే ఆన్లైన్ ద్వారా పన్ను చెల్లించవలసినదిగా ఆయన కోరారు.
కొంత మంది వాహన యజమానులు వాహనాలను స్క్రాప్ చేసినట్టు తెలియజేస్తున్నారు. అటువంటివారు పన్ను బకాయిలు చెల్లించి, ఆన్లైన్ ద్వారా వాహన రిజిస్త్రేషన్ రద్దు పరచుకోవాలనీ సూచించారు. వాహనాలను తుక్కు కింద అమ్మాలన్నా, పాత సామాను కింద అమ్మాలన్నా ముందుగా వాహన రిజిస్ట్రేషన్ ను ఆర్ టి ఓ కార్యాలయంలో రద్దు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
కార్డ్ ల కొరత వలన ఆగస్ట్ 2021 నుండి డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు మరియు ఫిబ్రవరి 2022 నుండి రిజిస్ట్రేషన్ కార్డ్ లు సంభదిత వ్యక్తులకు పంపించ లేకపోయామని, త్వరలో వారి కార్డ్ లను పోస్ట్ ద్వారా వారికి పంపించడం జరుగుతుంది అని తెలిపారు