విశాఖ అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం
ఎంపీ విజయసాయిరెడ్డి
విశాఖపట్నం: జీ.వి.ఎం.సి ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి విజయాన్ని కోరుతూ రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి విస్తృతంగా శనివారం ప్రచారం చేశారు.43వ వార్డుతో పాటు పలు వార్డుల్లో ప్రచారం గావించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏ.పి ప్రజల సంక్షేమం కోసం వార్డు వాలంటీర్లు పని చేస్తున్నారని.వాలంటీర్లు వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ప్రభుత్వం విద్య వైద్య,మౌలిక సదుపాయాలు కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని,.అందుకోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ విద్యా సంస్ధలకు దీటుగా తీర్చిదిద్దడం కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల విద్యార్థులతోనే కాదు ప్రపంచ స్థాయిలో పోటి పడబోతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఎర్పాటు చెయ్యనున్న 26 జిల్లాలలో అన్ని మౌలిక సాదుపాయలతో కూడిన సుపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఎర్పాటు చేస్తాం..అలాగే ప్రతి జిల్లాలోనూ వైద్య కళాశాలను కూడ ఎర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొబోతుందన్నారు.
ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో ఇళ్లు లేని వారు ఉండకూడదు అన్న ఉద్దేశంతో 32 లక్షల ఇళ్లను ఈ ప్రభుత్వం మంజూరు చేసిందని .విశాఖ అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది..అన్ని విధాలుగా విశాఖ నగరాన్ని సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తామన్నారు.విశాఖ నగరం నుండి భోగ పురం ఎయిర్ పోర్టు వరకు అరు లైన్లు రోడ్లు రాబోతున్నాయని తెలిపారు. 43 వార్డులో అధికారులతో చర్చించి నీటి కొరత తీర్చేందుకు గాను ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఎర్పాటుకు ప్రయత్నం చేస్తామని,అంగన్ వాడీ కేంద్రం ఎర్పాటు చేస్తామని,కరెంటు స్థంబాలను పునరుద్ధరణ కృషి చేస్తామని వెంకటేశ్వర కాలనీలో కమ్యూనిటీ హాల్ ఎర్పాటు చేస్తామన్నారు.విజయసాయిరెడ్డి తో పాటు ప్రచారంలో మంత్రి అవంతి,ఎమ్మెల్యేలు గుడివాడ అమర్ నాధ్, అదీప్ రాజ్ లు పాల్గొన్నారు.