విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు

నిన‌దించిన కార్మిక‌, రాజ‌కీయ నాయ‌కులు
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యంపై ఆగ్రం
బీజేపీ మెడ‌లు వంచుతామ‌న్న కార్మిక నేతలు
విశాఖ‌లో భారీ ఆందోళ‌న‌
పార్టీల‌క‌తీతంగా నిర‌స‌న‌


విశాఖపట్నం : విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటూ ఒకసారి పెద్ద ఎత్తున ఉద్యమం జరగ్గా దాన్ని ప్రైవేటీకరించరాదంటూ మరో ఉద్యమానికి జడలు విప్పారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో విశాఖలో మరో ఉద్యమం మొదలైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటైజేషన్ చేస్తే ఊరుకునేది లేదని వివిధ పార్టీల నేతలు,ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉక్కు సంకల్పంతో ముందుకు కదలని నిర్ణయం తీసుకున్నాయి. శుక్రవారం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు
కుర్మన్నపాలెం నుండి నగరంలోని జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వరకూ కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు.
“విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” అంటూ నినదించారు. ప్రాణ త్యాగాలతో సాధించుకున్న ఉక్కు పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం చేయబోమని కార్మికులు తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.


విశాఖ ఉక్కు కర్మాగారంపై 40 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారని గుర్తు చేసిన కార్మిక నాయకులు, ప్రభుత్వం దిగివచ్చే వరకూ పోరాటం విరమించమంటూ కార్మికులు తేల్చి చెప్పారు. పార్లమెంట్ సభ్యులు ఎం. వి. వి. సత్యనారాయణ, డాక్టర్ సత్యవతిలు శిబిరాన్ని సందర్శించి వైసీపీ తరపున మద్దతు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ పార్లమెంట్లో ప్రభుత్వంను నీలాదీస్తామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ అంశాన్ని తీసుకు వెళ్తామన్నారు.

స్టీల్ ప్లాంట్లో నూటికి నూరుశాతం పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విశాఖపట్నంలో ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. స్టీల్ ప్లాంట్ కోసం వేలాది మంది పంటభూములు దారాదత్తం చేశారు. స్టీల్ ప్లాంట్ మూరో జింకు కానుందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలోనే సిపిఎం, సిపిఐ, తెలుగుదేశం, కాంగ్రెస్ ఇతర పక్షాలు ఆందోళన బాట పట్టాయి. శుక్రవారం ఆర్టీసీ ఏరియా ఉద్యమకారులతో నిండిపోయింది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని పక్షాలు కలసిరావాలని ఉద్యమకారులు పిలుపునిచ్చారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.గాజువాకలో కార్మికులు నిర్వహించిన ర్యాలీ లో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు.సిపిఎం నాయకులు సిహెచ్ నర్సింగరావు,సిపిఐ నాయకులు జే. వి. సత్యన్నారాయణ మూర్తి, ఉక్కు కార్మిక నేతలు రామారావు,ఆదినారాయణ అయోధ్యరామ్,నీరుకొండ రామచంద్ర,రావు,మంత్రి రాజశేఖర్, విల్లా రామ్మోహన్ రావు తదితరులు ఉద్యమంలో భాగస్వాములయ్యారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వైఖరిని దుమ్మెత్తి పోశారు. అధికార వైసీపీ కూడా ఉద్యమంలో పాల్గొనడంతో ఇక అందరి మాట ఒకటే అయింది. ఆర్ఐఎన్ఎల్ లో ఉన్న స్టీల్ ప్లాంటును కాపాడుకోవడమే ద్యేయంగా ఉద్యమం ముందుకు కదులుతోంది. బీజేపీ కూడా ఉద్యమానికి పరోక్షంగా మద్దతు తెలిపింది. జనసేన నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.

(Visited 64 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *