విశాఖ ఉక్కుపై కేంద్రం ప్రై‌వేటు

విశాఖ ఉక్కు దీపాన్ని ఆపేసిన కేంద్ర ప్రభుత్వం

లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కు ను అమ్మకానికి క్యాబినెట్ ఆమోదం

లక్షల కుటుంబాల భవిష్యత్తును అంధకారం

రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి

ఇప్పటికీ భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం జరగలేదు

32మంది ప్రాణత్యాగాలు పోరాటాల ఫలితమే విశాఖ ఉక్కు
ఆనాడు 70 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు

ఆంధ్రులకున్న ఏకైక అతిపెద్ద నవరత్న కంపెనీ

ఆంధ్రులు ఆడపడుచు నిర్మల సీతారామన్ కు ఎందుకంత కంటకింపు

 

విశాఖపట్నంః లాభాల్లో వున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.ప్రభుత్వరంగ సంస్ధలు అమ్మకంద్వారా 1,75లక్షల కోట్ల రూపాయల నిధులు సమకూర్చుకొనే పనిలో బాగంగా విశాఖ ఉక్కు లాంటి ప్రభుత్వరంగ సంస్దను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడానికి ఉత్తర్వులు జారీచేసారు.ప్రస్తుతం విశాఖ ఉక్కు కర్మాగారం భూముల విలువే 2లక్షల కోట్ల పైమాటే అటువంటి కర్మాగారం ను కారు చౌకగా 11వేల కోట్ల రూపాయలకు స్ట్రాటజిక్ సేల్ పేరుతో అమ్మకానికి వుంచడం వెనుక పలు అనుమానాలకు తావిస్తుంది .బడ్జెట్ సమావేశాలకు ముందుగానే కేబినెట్ ఆమోదం పొందినా గోప్యంగా వుంచి నిన్న సాయంత్రం ఈ విషయాన్ని బహిర్గతం చేసారు.దీంతో విశాఖ ఉక్కు కర్మాగారంపై ఆదారపడ్డ లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్దితి. దీంతో ఒక్కసారిగా కార్మికులు కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంవత్సరానికి 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో భవిష్యత్తులో 2030 సంవత్సరానికి 20 మిలియన్ టన్నుల విస్తరణకు కూడా వెళ్తుంది. ఈ డిసెంబర్లో 200 కోట్ల నికర లాభాలు కూడా ఆర్జించింది. అయితే 4750 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభమయిన విశాఖ ఉక్కు కర్మాగారం ఎప్పటికీ 40 వేల కోట్ల రూపాయలు వివిధ పన్నుల రూపంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చెల్లించింది. అటువంటి పరిస్థితులలో వున్న కర్మాగారాన్ని అన్నయ్య ని ఆలోచన ఎందుకు కలిగిందో ప్రజలకు తెలియాలి విశాఖ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నారు కంపెనీ విలువ 2.5 లక్షల కోట్లు అటువంటి కంపెనీని 11 వేల కోట్ల రూపాయలకు బేరం పెట్టింది దీని వెనుక కుట్ర ఉందని కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల క్రితం జాతీయ ఇంటక్ అధ్యక్షులు డాక్టర్ జి.సంజీవరెడ్డి గారి సారధ్యంలో అఖిలపక్ష కార్మిక సంఘాలు కూర్చుని చర్చించడం జరిగింది.కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం అఖిలపక్ష కార్మిక సంఘాలు ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అయితే తెలుగు ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు స్టాండ్ తీసుకోవాలని సంజీవ రెడ్డి గారు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో విషయంపై కార్మికులు కార్మిక సంఘాలు ఎదురుచూస్తున్నాయి.
దీపం DIPAM ( DEPARTMENT OF INVESTMENT AND PUBLIC ASSET MANAGEMENT) డిపార్ట్మెంట్ గత వారం విశాఖ ఉక్కును స్ట్రాటజిక్ సేల్ లో పెట్టాలని ఒక నోట్ ను కేంద్రానికి పంపడం, కేబినెట్ ఆమోదించడం చకచకా జరిగిపోయాయి.

జె.అయోధ్య‌రామ్‌ గుర్తింపు సంఘం CITU అధ్యక్షులు మాట్లాడుతూ..

విశాఖ ఉక్కు కర్మాగారం ఎన్నో పోరాటాలు తో వచ్చింది .70 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అనాడు కర్మాగారం కోసం రాజీనామాలు చేసారు.కొన్ని వందల మంది కర్మాగారం నిర్మాణంలో చనిపోయారు, 32 మంది ప్రాణ త్యాగాలు చేశారు, 17 వేల మంది నిర్వాసితులయ్యారు. ఈకర్మాగారంలో డైరెక్ట్ గా 35 వేల మంది,ఆదారపడి 65వేల మంది జీవనం సాగిస్తున్నారు. అటువంటి కర్మాగారము అమ్ముకోవాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది. గతంలో రెండు సార్లు డిజిన్వెస్ట్మెంట్ ,ప్రైవేటీకరణ అని వచ్చినప్పుడు కార్మికులు కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడి ఎదుర్కొన్నారు అని తెలియజేశారు.2018లో ఐఓపి,2019లో పోక్కో అని వచ్చాయి.ఇది కేవలం అంబానీకో అదానీకో అప్పగించడానికి తప్ప మరొకటి కాదని, రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా దీన్ని ఆర్షించడం లేదని అన్నారు .అందరు కార్మికులు,ప్రజలు ,ప్రజాప్రతినిధులను కలుపుకొని కర్మాగారం కాపాడుకోవడం కోసం ముందుకు సాగుతామని ,ఈ కంపెనీ ప్రభుత్వంరంగ సంస్దగా కొనసాగేలా చూసుకోవాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రజలందరిదీ అని తెలియజేశారు.

డి.ఆదినారాయణ,ఏఐటియూసీ జాతీయ ఉపాద్యక్షులు మాట్లాడుతూ…


విశాఖ ఉక్కు కర్మాగారం 100శాతం అమ్మేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలన్నీ పోరాటానికి సిద్ధపడుతున్నాయి. గతంలో కూడా ప్రభుత్వాలు ఈ ప్రయత్నం చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రితో సహా విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ సంస్థగా ఉంచాలని ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక సీసోరే కంపెనీ విశాఖ ఉక్కు కర్మాగారం. అయితే గత యాజమాన్యం ప్రైవేటీకరణ ప్రతిపాదన వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా కార్మికులు యాజమాన్యం అందరూ సమిష్టిగా పనిచేసి లాభాల బాటలోకి తీసుకొచ్చారు . కానీ నేటి యాజమాన్యం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా నిర్వాసితులు మరియు తెలుగు వారి ఉద్యోగాలను గండికొడుతూ కేంద్రం ప్రతిపాదనకు సహకరిస్తూ ప్రైవేటీకరణ చేయడానికి ముందుకు సాగుతున్నారు .విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించుకున్న ఈ కర్మాగారం 32 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ నెంబర్ వన్ అని పేరు తెచ్చుకుంది .అటువంటి కర్మాగారాన్ని అమ్మితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం

గంధం వెంకట్రావు స్టీల్ INTUC అధ్యక్షులు మాట్లాడుతూ…

ఆ నాడు ఇందిరాగాంధీ శంకుస్థాపన చేసినప్పుడు నిర్వాసితులు అందరికీ ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు . ఈరోజు సగం మంది నిర్వాసితులకు కూడా ఉపాధి లభించలేదు ఇంకా చాలామంది 35 సంవత్సరాలు గడుస్తున్నా ఉపాధి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. వారందరికీ అన్యాయం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని , కేవలం 4750 కోట్ల రూపాయల పెట్టుబడితో 42 వేల కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నుల రూపంలో చెల్లించాము. ప్రతి నెలా రెండు వందల కోట్ల రూపాయలు జీతాల ద్వారా మార్కెట్ లోకి వెళుతూ, పరిసర ప్రాంతాలైన గాజువాక విశాఖపట్నం అభివృద్ధి చెందాయని, నిర్ణయంతో విశాఖ అభివృద్ధి కుంటుపడుతుంది. ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అవసరమైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో కలపాలని, లేదంటే ఎన్ఎండిసి ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మెర్జ్ చేయాలి. అవసరమైతే అమ్మకానికి పెట్టిన 11 వేల కోట్ల రూపాయలు కార్మికులే ముందుకు వచ్చి కొనుగోలు చేసుకుంటామని, అంబానీ అదానీ వేదాంత లాంటి వారికి అప్పగిస్తే చూస్తూ ఊరుకోమని తెలియజేశారు . కార్మికులు మరియు తెలుగు ప్రజలందరూ ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని ,కర్మాగారాన్ని కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందజేయాలని విజ్ఞప్తి చేసారు.

(Visited 62 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *